International

ఆకాశంలో ‘భూకంపం’- విమానంలో ఒకరు మృతి, అనేక మందికి గాయాలు – Flight Turbulence

Published

on

Flight Turbulence Singapore : సింగపూర్ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడం వల్ల ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. లండన్​ నుంచి సింగపూర్ వెళ్తున్న SQ321 విమానంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు సింగపూర్ ఎయిర్​లైన్స్ సంస్థ వెల్లడించింది.

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం (SQ321) మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్‌ నుంచి సింగపూర్‌కు బయల్దేరింది. మార్గమధ్యలో ఫ్లైట్‌ తీవ్ర కుదుపులకు లోనుకావడం వల్ల దాన్ని థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయానికి అత్యవసరంగా మళ్లించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని సంస్థ వెల్లడించింది. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం.

విమానం తీవ్ర కుదుపునకు లోనైన ఘటనలో మరణించిన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్‌ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతున్నట్లు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version