Cinema

Dhoni: చరణ్ – ధోని కాంబినేషన్లో సినిమా.. పక్క సూపర్ హిట్..!

Published

on

మన టాలీవుడ్లో ఒక హీరో నటిస్తేనే ఆ సినిమాకి భారీ రేంజ్ లో హైబ్స్ ఉంటాయి.

అదే ఒక స్టార్ హీరో ఒక స్టార్ క్రికెటర్ కలిసి ఒక సినిమా చేస్తే ఆ సినిమా వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఆ సినిమాకి వీరిద్దరి అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తారు. అలా ఓ స్టార్ క్రికెటర్ స్టార్ హీరో కలిసి ఇప్పటివరకు ఎటువంటి సినిమాలో నటించలేదు. అలా నటించాలి అనేదే ప్రేక్షకుల కోరిక. ఇక ఎట్టకేలకు ఆకల నెరవేరానుంది.

Charan-Dhoni combination movie
టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన రామ్ చరణ్ మరియు వరుస సెంచరీలు చేసి మంచి ఫేమస్ అయిన ధోని కలిపి ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న మూవీ ‘ గేమ్ చేంజర్ ‘. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అనంతరం బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు చరణ్. ఇక ఇదిలా ఉంటే మరోవైపు ధోని ఈ సంవత్సరం క్రికెట్ కి విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. తన కాలు సర్జరీ మూలంగా తాను క్రికెట్ కి విరామం ఇచ్చాడు.ఇక తన క్రికెట్ కి విరామం ఇచ్చినప్పటికీ తన ప్లేయర్స్ ని మాత్రం ఇన్స్పైర్ చేస్తున్నాడు. మరి 2024 క్రికెట్లో ధోని పాల్గొంటాడో లేదో ఇంకా తెలియదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ మరియు ధోని కలిపి ఓ సినిమా చెయ్యనున్నారట. గత కొంతకాలం నుంచి ధోని సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ అనేక ప్రచారాలు జరిగాయి. కానీ వీటిని పెద్దగా ఎవరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు ఇదే నిజమవుతుంది. మరి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే ఆ సినిమాకి ఏ డైరెక్టర్ డైరెక్షన్ చేస్తున్నారో తెలియకపోయినా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదే కనుక నిజం అయితే ఆ సినిమా పక్క సూపర్ హిట్ అని చెప్పొచ్చు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version