National

భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుద్పాదక విద్యుత్ పార్క్.. విస్తీర్ణంలో ప్యారిస్ కంటే 5 రెట్ల ఎక్కువ భూమిలో..

Published

on

ఎవరైనా విమానాల్లో వస్తే వాటిని గైడ్ చేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సౌకర్యం కూడాలేని విధంగా ఆ ప్రాంతంలో ఎయిర్‌స్ట్రిప్ ఉంటుంది. దానిపైనే విమానాలు దిగాల్సి ఉంటుంది. పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంలో బంజరు భూమి మధ్యలో కొన్నేళ్ల క్రితం ఎందుకు పనికిరాని ప్రాంతంగా అది కనపడేది. అక్కడకు వెళ్తే ఓ కంటైనర్‌లోని ఆఫీసులో పనిచేసుకోవాల్సి వచ్చేది.

ఇప్పుడు అదే ప్రాంతం ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్ పార్కుకు గేట్‌వేగా మారింది. 2022 డిసెంబర్‌లో అదానీ గ్రూప్ ఈ పార్కుకు సంబంధించిన పనులు ప్రారంభించింది. అప్పట్లో చాలా చిన్న ఎయిర్‌స్ట్రిప్ సాయంతో చిన్న విమానంలో పారిశ్రామికవేత్త గౌతం అదానీ అక్కడకు వెళ్లారు. అది పిన్‌కోడ్ కూడా లేని నిర్మానుష్య ప్రాంతం. ఇప్పుడు అదే ప్రాంతం దేశానికే పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది.

గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ గుజరాత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుద్పాదక ఇంధన పార్కును ఏర్పాటు చేసి, ఉత్పత్తిని ప్రారంభించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ఎడారిలో ఈ పార్కును ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి విద్యుత్‌ను నేషనల్ గ్రిడ్‌కు అందిస్తుంది.

ఈ ఖవ్దా పునరుద్పాదక ఇంధన పార్కు దాదాపు 538 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్యారిస్‌లోని పార్కు కంటే ఇది దాదాపు 5 రెట్లు పెద్దది. 30 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని ఇక్కడి నుంచి అదానీ గ్రూప్ ఉత్పత్తి చేయాలనుకుంటోంది. ప్రతి ఏడాది 81 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది.

ఈ పార్క్ ఇంధన రంగంలో మనదేశ పురోగతికి ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో రెండు కోట్ల ఇళ్లకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్లాంట్‌ ముంద్రాకు 150 కిలో మీటర్ల దూరంలోనే ఉంటుంది. మన దేశ గ్రీన్‌ ఎనర్జీ సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. ప్రతి ఏడాది 58 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించనుంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని అదానీ గ్రూప్ భావిస్తోంది.

Advertisement

ఇక్కడ కనీసం ఒక్క దోమైనా ఉందా? ఉంటే ఎవరైనా దాన్ని గుర్తించగలరా? అని ఈ ప్రాంతానికి తొలిసారి వచ్చినప్పుడు అదానీ జోక్ వేశారని, ఇప్పుడు ప్రపంచంలోనే ఇంత పేరు తెచ్చుకుందని ఆయన ప్రతినిధి ఒకరు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version