National

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Published

on

అయోధ్యలోనూ తిరుమల, టీటీడీ తరహా విధానాలను అమలు చేస్తామంటున్నారు రామమందిర తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు దినేశ్‌ రామచంద్ర. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఇప్పటికే అయోధ్యలో పర్యటించారని.. టీటీడీ పరిపాలనా విధానాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారన్నారు. దినేశ్ రామచంద్ర తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ సమయంలో తమ బృందంతో కలిసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.

అయోధ్యలో భక్తుల రద్దీ నియంత్రణ విషయంలో టీటీడీ తరహా విధానాలు అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు దినేశ్ రామచంద్ర. టీటీడీ తరహా విధానాలను అయోధ్యలో అమలు చేస్తామని చెబుతున్నారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించామన్నారు. తిరుమలలో టీటీడీ అమలు చేస్తున్న దర్శనం, వసతి, అన్నప్రసాదాల వంటి అంశాలను అయోధ్యలో కూడా అనుసరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం అయోధ్యలో రోజూ లక్ష నుంచి లక్షన్నర వరకు భక్తులు రాములవారిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు.

అయోధ్యలో భక్తుల రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రామచంద్ర. అందుకే భక్తుల సౌకర్యార్థం చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీని సలహాలు కోరినట్లు తెలిపారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి టీటీడీలో అమలు చేస్తున్న నియమావళి లిఖితపూర్వకమైన సలహాలు సూచనలు ఇచ్చారన్నారు. ఈ అన్ని అంశాలపై తాము చర్చించి అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై చర్చించి అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version