Andhrapradesh
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, సీపీఐ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, సీపీఐ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది. గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.
సీపీఐ పోటీ చేయనున్న స్థానాలు
విజయవాడ పశ్చిమ, విశాఖపట్నం పశ్చిమ, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, ఏలూరు, కమలాపురం.
లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. కాంగ్రెస్ మొదటి జాబితాని ఇప్పటికే విడుదల చేసింది. తొలి జాబితాలో 114 అసెంబ్లీ స్థానాలకు, ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
కడప లోక్‌సభ నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే, కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమహేంద్రవరం నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేస్తారు. ఏపీలో ఓటింగ్ మే 13న ఉంటుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4 విడుదల అవుతాయి.