Hyderabad
హైదరాబాద్‌లో కొత్త రైల్వే స్టేషన్.. శరవేగంగా పనులు, త్వరలోనే ప్రారంభం
హైదరాబాద్‌లో రైల్వే స్టేషన్లు అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే స్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి మాత్రమే. త్వరలో నగరంలో మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది.
జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికుల ఇబ్బందులు తీర్చేందుకు, హైదరాబాద్‌లోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లపై భారం తగ్గించేందుకు నగర శివారులో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఇది వరకే అక్కడ రైల్వే స్టేషన్ ఉండగా.. ఎయిర్ పార్టు తరహాలో ఆ స్టేషన్ అప్‌గ్రేడ్ చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది.