International

Helicopters: గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.!

Published

on

మలేసియా లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో రెండు హెలికాఫ్టర్‌లు ఢీకొన్న ఘటనలో 10 మంది మృతి చెందారు. గగనతలంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారుల వివరాలు ప్రకారం.. మలేసియాలో ఏప్రిల్‌ 26న రాయల్‌ మలేసియన్‌ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందుకోసం పెరక్‌లోని లుమత్‌ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్‌ సితియావాన్‌ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ఒకదానినొకటి ఢీకొని కుప్పకూలాయి. వీటిల్లో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోయింది.

మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది మరణించారు. వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్‌ కమాండర్లు ఉన్నారు. హెలికాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇటీవల జపాన్‌లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. గత శనివారం అర్ధరాత్రి వేళ ప్రత్యేక శిక్షణ నిమిత్తం వెళ్లిన రెండు నౌకాదళ హెలికాప్టర్‌లు ఢీకొని సముద్రంలో కుప్పకూలిపోయాయి. ఆ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఏడుగురు గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version