Weather
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆ ప్రాంతాల వారికి వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాదులో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ అమీర్‌పేట్, యూసఫ్‌గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దాదాపు రెండు నెలల నుంచి ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు కాస్త ఉపశమనం పొందింది. వానల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.