Andhrapradesh

రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. కారణం ఇదే!

Published

on

పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలనకు బ్రేక్‌ పడనుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదని, అందువల్లనే మే 22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం సోమవారం లేఖ రాసింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. సుమారు రూ.1,500 కోట్ల బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు.

రూ.530 కోట్ల విలువైన బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు మే 2న సీఈఓ తెలిపారు. ఇప్పటివరకు వాటిని చెల్లించలేదు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సుమారు రూ.50 కోట్ల బిల్లుల చెల్లింపులే జరిగాయని లేఖలో ఆశ తెలిపింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల ప్రారంభంలోనే నెట్‌వర్‌ ఆస్పత్రలు పలుమార్లు సర్కార్‌కు లేఖలు రాశాయి.

మే 4 నాటికి బకాయిలు చెల్లించకుంటే నగదు రహిత చికత్సలు నిలిపివేస్తాం అంటూ అందులోనూ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపివేయాలని నిర్ణయించామని తాజాగా ఆశ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version