Spiritual

Hanuman jayanti

Published

on

Hanuman jayanti 2024: హనుమాన్ జయంతి అనేక శుభయోగాలతో వచ్చింది. ఈ రోజున చిత్తా నక్షత్రం, వజ్రయోగం ఉంటుంది. అలాగే గ్రహాల స్థానం వల్ల గురు ఆదిత్య రాజయోగం, పంచ మహాపురుష యోగం, మాలవ్య యోగం, శశ యోగం కూడా ఉన్నాయి.

ఏప్రిల్ 23 ఉదయం నుంచి 24వ తేదీ ఉదయం 4.57 గంటల వరకు వజ్ర యోగం ఉంటుంది. ఏప్రిల్ 23 ఉదయం నుంచి రాత్రి 10.32 గంటల వరకు చిత్తా నక్షత్రం ఉంటుంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం మొదలవుతుంది. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు. హనుమంత్రికి ఇష్టమైన రోజు కూడా మంగళవారం. అదే రోజు వజ్రయోగం ఏర్పడుతుంది. ధైర్యానికి, బలానికి, శౌర్యానికి వజ్రయోగం ప్రతీకగా చెప్తారు. ఇటువంటి శుభకరమైన పరిస్థితులలో మంగళవారం హనుమాన్ జయంతి జరుపుకోవడం చాలా శుభప్రదం. ఈ సమయంలో పూజ చేస్తే అనేక ఫలాలు లభిస్తాయి.
గ్రహాల వల్ల శుభయోగాలు

మేష రాశిలో బృహస్పతి, సూర్యుడి కలయిక వల్ల గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా ఫలవంతమైనది. ఇది శుక్రుడు మాలవ్య రాజయోగం సృష్టిస్తున్నాడు. శని శశ రాజయోగం ఇస్తున్నాడు. అలాగే పంచామహా పురుష రాజయోగం కూడా ఉంటుంది. ఈ యోగం వల్ల సుఖసంతోషాలు పెరుగుతాయి.

శుభ ముహూర్తం

23 ఉదయం 6.06 గంటల నుంచి 7:40 నిమిషాల వరకు హనుమంతుడి ఆరాధనకు అనువైన సమయంగా పండితులు తెలిపారు. ఈరోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:53 వరకు ఉంటుంది.

Advertisement

పూజా విధానం

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. హనుమంతుడికి ఇష్టమైన ఎరుపు లేదా కాషాయం రంగు దుస్తులు ధరించడం మంచిది. హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు సులభమైన మార్గం శ్రీరామ నామాన్ని జపించడం. రామనామాన్ని జపించడానికి ప్రత్యేక నియమం ఉంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా రామనామాన్ని జపించవచ్చు.

హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే సుందరకాండ పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఉపవాసం ఉంటూ హనుమంతుడిని ధ్యానించుకుంటూ ఉండాలి. హనుమాన్ ఆలయానికి వెళ్లి విగ్రహానికి కుంకుమ రాయాలి. హనుమాన్ చాలీసా చదవడం బజరంగబన్ పఠించడం వల్ల మంచి జరుగుతుంది.

నైవేద్యంగా ఇవి పెట్టండి

హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన అరటిపండు, శనగపిండి లేదా బూందీతో చేసిన లడ్డూలు సమర్పించడం శుభప్రదం. అలాగే పూజ సమయంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. స్వామికి ఎరుపు రంగు పువ్వుల మాల సమర్పిస్తే సంతోషిస్తాడు. కుంకుమలో మల్లె నూనె కలిపి చోళం సమర్పించాలి. అలాగే శనగలు, బెల్లం కూడా సమర్పించవచ్చు.నెయ్యి దీపం వెలిగించి సుందరకాండ లేదా హనుమాన్ చాలీసా పఠించాలి.

Advertisement

హనుమంతుడితో పాటు శ్రీరాముడు, సీతాదేవిని కూడా పూజించాలి. ధన సంబంధ సమస్యలు అధిగమించేందుకు హనుమాన్ జయంతి రోజు హనుమంతుడితో పాటు లక్ష్మీదేవిని పూజించండి. చైత్ర పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రదేవుడికి అర్ఘ్యం సమర్పించాలి.
హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశుల జాతకులు కొన్ని మంత్రాలు పఠించడం వల్ల ప్రత్యేక ఫలితాలు కలుగుతాయి. హిందూమతంలో మంత్రొచ్చారణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. క్రమం తప్పకుండా మంత్రాలు జపించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version