Andhrapradesh
విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. వేసవి సెలవులు పొడిగింపు?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. కాగా మార్చి 15 వ తేదీ నుంచి విద్యార్థులకు ఒంటిపూట బడులు అమలులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలీడేస్ ఉండనున్నాయి. మొత్తం 45 రోజులకు పైగా వేసవి సెలవులు రానున్నాయి. అయితే ఎండల తీవ్రత ఇలాగే కొనసాగితే మాత్రం సమ్మర్ హాలీడేస్ పొడిగించే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై విద్యాశాఖ త్వరలోనే అపిషీయల్‌గా అనౌన్స్‌మెంట్ చేయనుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు సమ్మర్ హాలీడేస్ ఇవ్వనున్నారు. జూన్ 13 న స్కూల్స్ అన్ని రీఓపెన్ కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. సమ్మర్ హాలీడేస్ పొడగింపుపై వార్తలు విన్న విద్యార్థులు ఎగిరిగంతులేస్తున్నారు.