Career

Govt Jobs 2024 : హైదరాబాద్‌ మింట్‌లో కొలువులు… 96 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ముఖ్య వివరాలివే

Published

on

Security Printing Press Hyderabad Jobs 2024: హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్(Security Printing Press) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 96 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 15వ తేదీతో గడువు ముగియనుంది.

ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో(Security Printing Press Hyderabad Recruitment) పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తూ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 96 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా జూనియర్ టెక్నిషియన్(ప్రింటింగ్, కంట్రోల్) 68 ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ మార్చి 15వ తేదీతో ప్రారంభమైంది. ఏప్రిల్ 15వ తేదీతో ఈ గడువు ముగియనుంది. https://spphyderabad.spmcil.com వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తులను సమర్పించవచ్చు.

mint_jobs_2024_1710565337744

ఖాసముఖ్య వివరాలు :
ఉద్యోగ ప్రకటన – సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్

ఖాళీలు – 96
ఉద్యోగాల వివరాలు :

Advertisement
  • సూపర్‌వైజర్ (TO- ప్రింటింగ్) – 02.
  • సూపర్‌వైజర్ (టెక్- కంట్రోల్): 05.
  • సూపర్‌వైజర్ (ఓఎల్‌): 01.
  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 12.
  • జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్): 68.
  • జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్): 03.
  • జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్): 01.
  • జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్): 03.
  • ఫైర్‌మ్యాన్: 01.
  • అర్హతలు – ఆయా పోస్టులను అనుసరించి అర్హతలు ఇచ్చారు. కొన్ని పోస్టులకు పదో తరగతి అర్హతతోనే భర్తీ చేయనున్నారు. పని అనుభవం కూడా ఉండాలి. నోటిఫికేషన్ లో ఈ వివరాలను చూడొచ్చు.

    దరఖాస్తులు – ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.

      దరఖాస్తు రుసుం – ఓబీసీ రూ. 600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి.

      దరఖాస్తులు ప్రారంభం – మార్చి 15, 2024.

      దరఖాస్తులకు తుది గడువు – ఏప్రిల్ 15,2024.

      ఆన్ లైన్ దరఖాస్తులకు లింక్ – https://ibpsonline.ibps.in/

    దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలతో లాగిన్ కావాలి.

    Advertisement

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Trending

    Exit mobile version