Business

Google Wallet : గూగుల్ పే కంటే గూగుల్​ వాలెట్‌కి విపరీతమైన డిమాండ్‌! దీని స్పెషాలిటీ ఏంటంటే..?

Published

on

Google Wallet In India : టెక్ దిగ్గజం గూగుల్ నెటిజన్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలో.. గూగుల్ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. గూగుల్ వాలెట్ ఎందుకంటే.. సాధారణంగా మీ వాలెట్ లేదా పర్స్లో తీసుకెళ్లే క్రిడిట్, డెబిట్ కార్డులు, ఈవెంట్ టిక్కెట్స్, ఎయిర్లైన్ బోర్డింగ్ పాసులు, స్టూడెంట్ ఐడీ వంటి వాటిని గూగుల్ వాలెట్లో డిటిజల్ వెర్షన్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత షాపింగ్ లేదా ఇతర ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు ట్యాప్ అండ్ పే పద్ధతిలో ఈజీగా పని పూర్తి చేసుకోవచ్చు.

ఒక ఆన్‌లైన్ పేమెంట్ కోసం మాత్రమే కాకుండా.. డ్రైవింగ్ లైసెన్స్, ట్రాన్సిట్ కార్డులు, ఇతర ఐడీ కార్డులు వంటి డాక్యుమెంట్లు కూడా దీంట్లో భద్రపర్చుకోవచ్చు. ఈ కారణంగానే యూఎస్‌లో గూగుల్ పే కు మించి గూగుల్ వాలెట్ ఎక్కువ ఆదరణ పొందింది. గూగుల్ పే లో ఉన్న ఫీచర్స్ అన్నీ గూగుల్ వాలెట్‌లో ఉంటాయి. మీ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ కోసం ప్రత్యేకంగా పర్సు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అయితే.. ఈ యాప్ సేవలను గూగుల్ ఇప్పటికే కొన్ని దేశాల్లో అందిస్తోంది. కానీ.. భారతదేశంలో మాత్రం గూగుల్ వాలెట్ సర్వీసులు అందుబాటులో లేవు. అయినప్పటికీ కొంతమంది యూజర్లు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా గూగుల్ వాలెట్ సేవలను వినియోగించుకుంటున్నారు.

అంతేకానీ.. గూగుల్ వాలెట్ భారత్లో మాత్రం అధికారికంగా అందుబాటులో లేదు. గూగుల్ వాలెట్ ప్లేస్టోర్లో కూడా లేదు. అయితే.. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ వాలెట్ పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే APK (Android Application Package)ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయవచ్చు. గత కొన్నాళ్లుగా భారత్లో గూగుల్ వాలెట్ అందుబాటులోకి వచ్చేస్తుందని ఎన్నో రూమర్స్ వస్తున్నప్పటికీ గూగుల్ మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీన్నిబట్టి చూస్తే గూగుల్ వాలెట్ భారత్లో లాంఛ్ అయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version