National

భారతీయులకు శుభవార్త.. స్కెంజెన్ వీసా నిబంధనల్లో మార్పులు చేసిన ఈయూ

Published

on

స్కెంజెన్ వీసాతో పర్యటించే భారతీయులకు ఐరోపా సమాఖ్య (యూరోపియన్ యూనియన్) శుభవార్త చెప్పింది. ఇకపై తరుచూ స్కెంజన్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యేలా మల్టిపుల్ ఎంట్రీ స్కెంజెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. స్కెంజెన్ (షార్ట్ స్టే) వీసాల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు కొత్త విధానం తీసుకొచ్చినట్టు తెలిపింది. వారి ట్రావెల్ హిస్టరీని బట్టి వీసాపై పలు సంవత్సరాల వ్యాలిడిటీకి అనుమతిస్తుందని పేర్కొంది.

ఐరోపా సమాఖ్య కమిషన్ ఏప్రిల్ 18న భారతీయ పౌరులకు మల్టిపుల్ ఎంట్రీ వీసాల జారీపై నిర్దిష్ట నిబంధనలను ఆమోదించింది. ఇది ఇప్పటి వరకు వర్తించే వీసా ప్రామాణిక నిబంధనల కంటే చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వచ్చిన వీసా ‘క్యాస్కేడ్’ విధానం ప్రకారం.. భారతీయ పౌరులకు ఇప్పుడు దీర్ఘకాలిక, బహుళ-ప్రవేశాల కోసం స్కెంజెన్ వీసాలు జారీ చేయనున్నారు. దీనికి అర్హత సాధించాలంటే గత మూడేళ్లలో కచ్చితంగా రెండుసార్లు వీసా ఆమోదం పొంది ఉండాలి. చట్టబద్ధంగా దాన్ని వాడుకుంటే తర్వాత రెండేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.

అమెరికా విజిటర్స్ వీసాను పదేళ్ల కాల పరిమితితో మంజూరు చేస్తుండగా.. యూకేలో వ్యవధి తక్కువగా ఉన్నప్పటికీ రూ.లక్షకు పైగా రుసుము చెల్లిస్తే పదేళ్లు వరకు చెల్లుబాటు అయ్యే వీసాను పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల పాటు చెల్లుబాటయ్యేలా స్కెంజన్ వీసాలో మార్పుచేయడం చాలా పెద్ద నిర్ణయమని ఈయూ అధికారులు తెలిపారు.

‘కొత్తగా స్వీకరించిన వీసా ‘క్యాస్కేడ్’ విధానం ప్రకారం.. భారతీయ పౌరులకు ఇప్పుడు దీర్ఘకాలిక, బహుళ-ప్రవేశ స్కెంజెన్ వీసాలు జారీ చేయబడతాయి.. గత మూడేళ్లలో రెండు వీసాలను పొంది, చట్టబద్ధంగా ఉపయోగించిన తర్వాత రెండేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.. పాస్‌పోర్ట్‌ గడువు ఉంటే రెండేళ్ల వీసా సాధారణంగా ఐదేళ్ల వీసాతో ఉంటుంది.. ఈ వీసా పొందినవారు స్కెంజన్ ప్రాంతంలోని దేశాల పౌరులతో సమానమైన ప్రయాణ హక్కులను అనుభవిస్తారు’ అని EU ఒక ప్రకటనలో తెలిపింది.

యూరోపియన్ యూనియన్, భారత్ మధ్య వలస విధానంపై సమగ్ర సహాకారం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈయూ అధికారులు వెల్లడించారు. స్కెంజెన్ వీసా పొందితే ఏదైనా 180 రోజుల వ్యవధిలో గరిష్ఠంగా 90 రోజుల పాటు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రయాణించరాదు. ఈ వీసాలతో ఈయూ దేశాల్లో పనిచేసే హక్కు మాత్రం ఉండదు. స్కెంజెన్ ప్రాంతంలో ఉండే 29 ఐరోపా దేశాల్లో ఈ వీసాతో పర్యటించడానికి అవకాశం ఉంటుంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version