Railway
వృద్ధులు గర్భిణులకు గుడ్ …న్యూస్ రైల్వే ప్రయాణాల్లో వెసలు బాటు
మనదేశంలోని రవాణా సాధనాల్లో రైలు చాలా ప్రధానమైనది. అత్యధిక శాతం మంది ప్రజలు వినియోగించేది ఈ రైళ్లనే. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాలు ప్రయాణించాలనుకునే వారికి ఈ రైలు అనేది చాలా అనువుగా ఉంటుంది.
అందుకోసం అందరూ ముందస్తు రిజర్వేషన్ కూడా చేయించుకుంటారు. సాధారణంగా చాలా మంది ప్రయాణీకులు రిజర్వేషన్ చేయించుకునే సమయంలో పై బెర్త్‌కు బదులుగా లోయర్ బెర్త్ సీట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే రిజర్వేషన్ సమయంలో ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని పొందలేరు. ఎందుకంటే లోయర్ ఎన్ని ఉన్నాయో అప్పర్ కూడా అంతే సంఖ్యలో ఉంటాయి కాబట్టి అందరికీ లోయర్ కావాలంటే కుదరదు. అలాంటి సమయంలో ఎవరైనా వృద్ధులు, గర్భిణులు ప్రయాణం చేస్తుంటే.. వారికి తప్పనిసరిగా లోయర్ బెర్త్ అవసరం అవుతుంది. అలాంటి వారి కోసమే భారతీయ రైల్వే కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. రైళ్లలో వృద్ధులు, గర్భిణులకు ప్రత్యేక వెసులుబాట్లను ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రైలులో వృద్ధులకు ..
సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే అనేక నిబంధనలను రూపొందించింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం లోయర్ బెర్త్‌లను బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్‌లను సులభంగా కేటాయించడం గురించి ఐఆర్సీటీసీ ఇటీవల ఓ ట్వీట్ ద్వారా వివరించింది. లోయర్ బెర్త్‌లు అందుబాటులో ఉన్నప్పుడే వాటిని బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేసింది. అదే సమయంలో, బుకింగ్ సమయంలో రిజర్వేషన్ ఛాయిస్ బుక్ కింద లోయర్ బెర్త్ కావాలనుకుంటే మీకు లోయర్ బెర్త్ లభిస్తుంది. మీరు లోయర్ బెర్త్ సదుపాయాన్ని పొందాలనుకుంటే, పురుషుడి వయస్సు 60 సంవత్సరాల కంటే ఎక్కువ, స్త్రీ వయస్సు 58 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి.
గర్భిణులకు..
ఒక మహిళ గర్భవతి అయితే, ఆమెకు లోయర్ బెర్త్‌లో ప్రాధాన్యత లభిస్తుంది. లోయర్ బెర్త్‌లో 45 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సీనియర్ సిటిజన్లు లేదా మహిళలు లోయర్ బెర్త్ సీటును బుకింగ్ కౌంటర్ లేదా రిజర్వేషన్ కార్యాలయం నుంచి మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా, గర్భిణీ స్త్రీలు మెడికల్ సర్టిఫికేట్ చూపించవలసి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే వారి సీటు కన్ఫర్మ్ అవుతుంది.
ప్రయాణ సమయంలో టీటీ ద్వారా..
అదే సమయంలో, ఎవరైనా సీనియర్ సిటిజన్‌లు, దివ్యాంగులు లేదా గర్భిణులు పై బెర్త్‌కు టికెట్ పొందినట్లయితే, టిక్కెట్‌ను తనిఖీ చేసే సమయంలో టీటీ ఆన్‌బోర్డ్ వారికి దిగువ బెర్త్‌ను కూడా అందించవచ్చు. రైల్వే నిబంధనల ప్రకారం, దిగువ బెర్త్‌పై ప్రయాణించే ప్రయాణికులు పగటిపూట కూడా పైభాగంలో ఉన్న ప్రయాణికుడికి సీటు ఇవ్వాలి. రైల్వే నియమం ప్రకారం, ఇద్దరు ప్రయాణికులు ఆర్ఏసీ (రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్) తో ఇప్పటికే దిగువ బెర్త్‌లో ప్రయాణిస్తున్నట్లయితే, వారు కూడా బెర్త్ ఇవ్వాల్సి ఉంటుంది.