Business

Gold Rate Today: అదిరే శుభవార్త.. కుప్పకూలిన బంగారం ధర.. ఒక్కరోజే రూ.1000 డౌన్.. నేటి ధరలు ఇవే!

Published

on

Gold Rate Today: భారతీయులకు బంగారంపై అతీతమైన ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎంతో కొంత బంగారం తమ వద్ద ఉండాలనుకుంటారు. బంగారం ఎంత ఎక్కువ ఉంటే అంత గౌరవంగా భావిస్తారు. ఇక ప్రత్యేక సందర్భాలు, శుభకార్యాలు, వేడుకలు ఉంటే బంగారం కచ్చితంగా కొనాల్సిందే. ఇటీవలి కాలంలో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మన దేశంలో బంగారం విక్రయాలు ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే ఏకంగా 700 టన్నుల బంగారం కొన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు పసిడి ప్రియులకు మరో శుభవార్త.

ఇవాళ బంగారం ధరలు భారీగా పడిపోయాయి. తులం రేటు ఏకంగా రూ.1000 మేర దిగివచ్చింది. మరోవైపు.. వెండి సైతం తగ్గింది. బంగారం, వెండి కొనుగోలుకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఎందుకంటే మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మే 2వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎంతకు దిగివచ్చాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్లో క్రితం రోజు భారీగా దిగివచ్చిన బంగారం ధర ఇవాళ మళ్లీ వేగంగా పుంజుకుంది. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ ఏకంగా 50 డాలర్ల వరకు పెరగడం గమనార్హం. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2325 డాలర్ల వద్ద ఉంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 26.82 డాలర్ల వద్ద కొనసాగుతోంది. రూపాయి మారకం విలువ కాస్త పుంజుకుని రూ.83.468 వద్ద అమ్ముడవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. అంతకు ముందు సెషన్‌లో రూ.300 దిగివచ్చిన తులం బంగారం రేటు ఇవాళ మరో రూ.1000 పడిపోయింది. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం రేటు హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ.65 వేల 550 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ 10 గ్రాములకు రూ.1090 తగ్గి రూ. 71 వేల 510 వద్దకు పడిపోయింది. ఇక ఢిల్లీలో చూస్తే 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1090 పడిపోయి రూ.71510 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం రేటు ఢిల్లీలో రూ. 65,550 వద్ద ఉంది.

హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర వరుసగా పడిపోతోంది. వారం రోజుల్లో కిలో వెండి రేటు రూ.1500 మేర దిగివచ్చింది. ఇవాళ రూ.500 తగ్గి రూ. 83 వేల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఢిల్లీ మార్కెట్లో చూస్తే ఇవాళ కిలో వెండి రేటు రూ.500 మేర తగ్గి రూ. 83,000 మార్క్ వద్ద అమ్ముడవుతోంది. పైన పేర్కొన్న ధరల్లో జీఎస్‌టీ వంటి పన్నులు, ఇతర ఛార్జీలు కలపలేదు. వాటన్నింటినీ కలిపితే ధరలు కాస్త పెరుగుతాయి.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version