Business
Gold and Silver Prices:
దేశంలో పుత్తడి(gold) ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(మే 4న) పసిడి ధర దాదాపు 500 రూపాయలకు పైగా తగ్గింది. శుక్రవారం సాయంత్రం ఒకవైపు స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం ఉండగా, మరోవైపు బంగారం ధర కూడా పడిపోయింది. ఈ క్రమంలో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గింది. ఈ పతనంతో 10 గ్రాముల ధర రూ.71,870కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం అదే స్థాయిలో తగ్గింది. దీంతో 10 గ్రాములకు రూ.65,890కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,720కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.65,740గా ఉంది
వెండి ధరలు
ఇక వెండి(silver) ధరల విషయానికి వస్తే ఈరోజు ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.83,400గా చేరుకుంది. ఇది నిన్నటి రేటుతో పోల్చితే 200 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.86,900కు చేరింది. ముంబైలో రూ.83,400, బెంగళూరులో రూ.82,600, చెన్నైలో కూడా రూ.86,900గా ఉంది.
ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరలు
ఢిల్లీలో బంగారం ధర రూ. .71,870, ధర రూ. 65,890
హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 71,720, ధర రూ. 65,740
చెన్నైలో బంగారం ధర రూ. 72,150, ధర రూ. 66,140
ముంబైలో బంగారం ధర రూ. 71,720, ధర రూ. 65,740
కోల్‌కతాలో బంగారం రూ. 71,720, ధర రూ. 65,740
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది. అంతేకాదు GST, TCS, ఇతర ఛార్జీలు వీటిలో కలిగి ఉండవని గమనించగలరు.