Business

Gold and silver prices today : హైదరాబాద్​లో రూ. 80వేలు దాటిన వెండి ధర.. బంగారం రేటు ఎంతంటే!

Published

on

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 60,590గా ఉంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,05,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,059గా కొనసాగుతోంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా.. రూ. 66,100 వద్ద ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,61,000గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,740గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,250గా ఉంది. ఇక కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,590 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 66,100గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 61,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,710గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 60,590గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 66,100గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,100గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

Advertisement

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,640గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 66,150గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 60,590గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,100గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేటు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..
దేశంలో వెండి ధరలు సైతం ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,730గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 77,300గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 80,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 77,300.. బెంగళూరులో రూ. 76,100గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version