Business

Gold and silver prices: స్వల్పంగా పెరిగిన బంగారం రేటు; భారీగా పెరిగిన ప్లాటినం ధర

Published

on

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు గురువారం కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 250 పెరిగి రూ. 59, 710 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. రూ. 59,460 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,97,100 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,971 గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 300 పెరిగి రూ. 65,160 గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 64, 860 గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,51,600 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,516 గా ఉంది.
చెన్నైలో బంగారం ధర
Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 59,860 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65,290 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 59,710 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 65,140 గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,410 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 65,900 గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 59,710 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 65,140గాను ఉంది.

హైదరాబాద్ లో బంగారం ధర
Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 59,710గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 65,140 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 59,760గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 65,140 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 59,710 గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 65,140 గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి రేటు..
దేశంలో వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,440 గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి, రూ. 74,400 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 74,500 గా ఉంది.

Silver rate in Hyderabad
: కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,400.. బెంగళూరులో రూ. 74,100 గా ఉంది.
ప్లాటినం ధరలు ఇలా..
దేశంలో ప్లాటినం రేట్లు గురువారం భారీగా పెరిగాయి. 10గ్రాముల ప్లాటినం ధర రూ. 750 పెరిగి రూ. 24,150 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 23,400 గా ఉండేది.

Advertisement

ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 24,150 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version