Education

GATE 2024 results : అలర్ట్​.. ఇంకొన్ని రోజుల్లో గేట్​ 2024 ఫలితాలు విడుదల..

Published

on

GATE 2024 results date : గేట్​ 2024 ఫలితాలపై కీలక అప్డేట్​! బెంగళూరులోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్​సీ).. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2024) ఫలితాలను మార్చ్​ 16న విడుదల చేయనుంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు.. gate2024.iisc.ac.in అధికారిక వెబ్​సైట్​లో తమ ఫలితాలను చెక్​ చేసుకోవచ్చు. గేట్ 2024 ఆన్​లైన్​ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (జీఓఏపీఎస్) పోర్టల్లో అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.ఫలితాలతో పాటు కటాఫ్ వివరాలను కూడా ఐఐఎస్​సీ బెంగళూరు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అభ్యర్థులు పరిశీలించాలి.

GATE 2024 results when : గేట్ 2024 పరీక్ష.. 2024 ఫిబ్రవరి 3 నుంచి 11 వరకు జరిగింది. మార్చ్​ 16న ఫలితాలు వెలువడిన తర్వాత.. అభ్యర్థులు మార్చ్​ 23 నుంచి మే 31, 2024 వరకు స్కోర్​ కార్డులను జీఓపీఎస్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వాలిడ్​ గేట్ స్కోర్ ఉన్న అభ్యర్థులు ఇంజనీరింగ్ / టెక్నాలజీ / సైన్స్ / ఆర్కిటెక్చర్ / హ్యుమానిటీస్​లో మాస్టర్స్ ప్రోగ్రామ్​లు, డైరెక్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్​లలో ప్రవేశం పొందవచ్చు. అలాగే విద్యా మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ సంస్థల మద్దతు ఉన్న సంస్థల్లో ఇంజనీరింగ్ / టెక్నాలజీ / సైన్స్ / ఆర్కిటెక్చర్ / హ్యుమానిటీస్ సంబంధిత బ్రాంచీల్లో డాక్టోరల్ ప్రోగ్రామ్​లను పొందవచ్చు.

ఈ గేట్​ స్కోర్​ కార్డు గరిష్ఠంగా మూడేళ్ల పాటు పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

How to check GATE 2024 results : మరోవైపు.. ప్రొవిజనల్​ గేట్​ 2024 ఆన్సర్​ కీని ఇప్పటికే రిలీజ్​ చేసింది ఐఐఎస్​సీ బెంగళూరు. ఫిబ్రవరి 19న.. ఆన్సర్​ కీని సైతం విడుదల చేసింది. గేట్​ 2024 పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. ఆన్సర్​ కీని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

Advertisement

కౌన్సిలింగ్​కి సంబంధించిన వివరాలను ఐఐఎస్​సీ బెంగళూరు వెల్లడించాల్సి ఉంది. గేట్​ 2024 ఫలితాలు విడుదలైన తర్వాత.. దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version