Health
Garlic Benefits: ఖాళీ కడుపుతో నాలుగు పచ్చివెల్లుల్లి రెబ్బలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..? నమ్మశక్యం కాని ప్రయోజనాలు..
పచ్చి వెల్లుల్లి పోషకాలకు పవర్ హౌస్ ఇందులో మన శరీరానికి కావాల్సిన న్యూట్రియన్స్, విటమిన్స్ ,మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీంతో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి వెల్లుల్లిలో రక్తనాళాలు ఆర్టెరీ బ్లాక్ ఏర్పడకుండా కాపాడుతాయి. ఇందులో సల్ఫర్ హైడ్రోజన్ గా మార్చి ఎర్ర రక్త కణాలు సల్ఫైడ్ గ్యాస్ గా మారుస్తాయి. దీంతో రక్తనాళాలు విస్తరించి బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తుంది.
పచ్చివెల్లుల్లి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. అంతేకాదు శక్తి కూడా తక్షణమే పెరుగుతుంది. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ సీజనల్ వ్యాధులు రాకుండా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చిగా తిన్నా ఉడికించి తిన్న కానీ ఇందులోని పోషకాలు మన శరీరానికి అందుతాయి. ఇందులోని విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం, జింక్, సల్ఫర్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం మన శరీరానికి అందుతాయి.
ప్రతిరోజూ వెల్లుల్లి తినడం వల్ల శరీరం డిటాక్సిఫికేషన్ కు గురవుతుంది. సమ్మేళనాలు శరీరం నుండి విషాన్ని, లోహాలను, వ్యర్ధాలను తొలగిస్తాయి. రక్తంలో సీసం స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. తలనొప్పి, అధిక రక్తపోటు వంటి లక్షణాలు రాకుండా ఉంటాయి.ఇందులోని విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం, జింక్, సల్ఫర్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం మన శరీరానికి అందుతాయి.
వెల్లులిలో యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు ఎక్కువ. అలాగే యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉన్నాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తిని అందిస్తాయి. అంటువ్యాధులను నివారిస్తాయి. దీనిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. సాల్మొనెల్లా, ఈ. కోలి వంటి వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తిని అందిస్తాయి.