International
నలుగురు బందీలను విడిపించిన ఐడీఎఫ్- ఇజ్రాయెల్ దాడుల్లో 94మంది మృతి!
Israel Rescues 4 Hostages : హమాస్ చెరలో ఉన్న నలుగురు బందీలను శనివారం ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి వీరిని ప్రత్యేక దళాలు కాపాడాయని వెల్లడించింది. అయితే బందీలను రక్షించే ప్రయత్నంలో భాగంగా సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో భారీగా పాలస్తీనియన్లు మృతి చెందారని ఏపీ వార్తా సంస్థ తెలిపింది. దేర్ అల్ బలాహ్‌లోని అల్-అఖ్సా ఆసుపత్రికి దాదాపు 94 మృతదేహాలు వచ్చాయని తెలిపింది. 100మందికి గాయాలయ్యాయని పేర్కొంది.
గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై దాడి చేసి 250మందిని హమాస్ బందీలుగా పట్టుకున్నారు . వీరిలో కొంతమందిని నవంబరులో జరిగిన కాల్పుల విరమణ సమయంలో హమాస్ విడిచిపెట్టింది. ఇంకా 120మంది హమాస్ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్ పేర్కొంది.