Andhrapradesh

ఫారం 12, గడువు పొడిగింపు. ఎలెక్షన్ కమిషన్

Published

on

ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Election 2024)ఈనెల 13వ తేదీన జరుగుతుండటంతో.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రకియను ఎన్నికల సంఘం(Election Commission) చేపట్టింది.
ఈ పోస్టల్ బ్యాలెట్‌లో గందరగోళం నెలకొంది. చాలా మంది ఉద్యోగులకు సకాలంలో డ్యూటీ పాస్‌లు అందలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మే 1లోగా ఫార్మ్ 12ను ఉద్యోగులు, ఉపాధ్యాయులు సబ్మిట్ చేయలేకపోయారు. తమ ఓటు కోల్పోతున్నామని ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులుత తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ పరిస్ధితిని చక్కదిద్దేందుకు ఈసీ ప్రయత్నం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ఆర్వోలకు పోస్టల్ బ్యాలెట్ విషయంలో అదనపు ఆదేశాలను ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా జారీ చేశారు. సకాలంలో సమాచారం లేకపోవడంతో పోస్టల్ బ్యాలెట్ పొందలేకపోయామని భావిస్తున్న ఉద్యోగులకు మరో అవకాశం ఇవ్వాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల్లో కొందరు అనివార్య కారణాలతో ఫాం 12 సబ్మిట్ చేయలేకపోవడంతో ఓటు వేసే అవకాశం లేకుండా పోతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి.. ఓటును కోల్పోవడానికి వీలు లేదని ఎన్నికల సంఘం భావించింది. మే 1, 2024లోగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఫాం 12ను అనివార్య కారణాలతో సబ్మిట్ చేయని పక్షంలో వారికి తిరిగి అవకాశం ఇవ్వాలని సీఈఓ మీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం ఇస్తోందని సీఈవో మీనా వెల్లడించారు.

ఈనెల 7, 8 తేదీల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఫాం 12ను ఉద్యోగులు వారి ఓటు ఉన్న ఆర్వో పరిధిలోని ఫెసిలిటేషన్ సెంటర్లో సబ్మిట్ చేయాలని తెలిపారు. ఇలాంటి వారికి ఓటింగ్ కల్పించేందుకు 175 నియోజకవర్గాల ఆర్వోలు వారి నుంచి ఫాం 12ను వారి పరిధిలో ఓటు ఉంటే స్వీకరించాలని ఆదేశించారు. ఉద్యోగి ఓటరు కార్డు వివరాలు పరిశీలించి, పోస్టల్ బ్యాలెట్ కేటాయించలేదని నిర్ధారించుకున్న తర్వాత ఓటు వేసే అవకాశం 7, 8 తేదీల్లో ఇవ్వాలని ఆదేశించారు.

ఉద్యోగులకు ఈసీ ఆదేశాల మేరకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్వోలు సంబంధిత రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల డ్యూటీ పక్క జిల్లాలో పడి ఫాం 12 సబ్మిట్ చేయని ఉద్యోగులకు వారి ఓటు ఉన్న పరిధిలో ఆర్వో ఫెసిలిటేషన్ సెంటర్‌కు వెళ్లి ఓటు పొందవచ్చని సూచించారు. ఉద్యోగులు తమ అపాయింట్మెంట్ లెటర్‌తో పాటు వెళ్లి ఈ నెల 7, 8 తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటును ఆర్వోలు తిరస్కరించినట్టు తెలితే వారిపై చర్యలు తీసుకుంటామని సీఈవో మీనా హెచ్చరించారు. ఈ మేరకు అందరు ఆర్వోలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా మెమో జారీ చేశారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version