Education

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే..

Published

on

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే..
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను నేరుగా అందించాలని నిర్ణయం తీసుకుంది. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పేస్ట్, బ్రష్, షాంపూ వంటి కాస్మొటిక్ వస్తువులను ఉచితంగా అందివ్వనున్నారు. అయితే గతంలోనూ విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను ఉచితంగా అందించేవారు. అయితే నేరుగా ఇవ్వకుండా వారి తల్లుల ఖాతాల్లో ఈ మొత్తం జమ చేస్తూ వచ్చారు. అయితే ఈ ఛార్జీలు సకాలంలో అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారనే వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాస్మొటిక్ వస్తువులను విద్యార్థులకు నేరుగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.

గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాఠశాల విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను నేరుగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కాస్మొటిక్ వస్తువులను నేరుగా ఇవ్వకుండా.. కాస్మొటిక్ ఛార్జీలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తూ వచ్చింది. అయితే ఆ నగదు సకాలంలో విడుదల చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కాస్మొటిక్ వస్తువులు అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే పేస్టు, బ్రష్, షాంపూ వంటి కాస్మొటిక్ వస్తువులను నేరుగా వారికి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ అధికారులు తమ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు పంపారు. సీఎం చంద్రబాబు ఆమోదిస్తే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version