Andhrapradesh
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్.. నేటి నుంచి బంద్!!
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు (AP Government Employees) ప్రైవేటు ఆస్పత్రులు (Private Hospitals) షాక్ ఇచ్చాయి. నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్సలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ప్రైవేటు ఆసుపత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఈనెల ఏడవ తేదీ నుంచి అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రైవేటు ఆస్పత్రులకు డిసెంబర్‌లో 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉంది. అయితే అప్పట్లో ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని (Aarogysree) నిలిపివేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం కేవలం రూ.560 కోట్లు మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని బకాయిపెట్టారు.
.