International

అమెరికాలో ఘోర ప్రమాదం.. ఓడ ఢీకొని కుప్పకూలిన భారీ వంతెన.. నదిలో పడిపోతున్న కార్లు.. వీడియో వైరల్!

Published

on

US Bridge Collapse : అగ్రరాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని బాల్టిమోర్‌లోని ప్రధాన వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ కంటైనర్లతో వెళ్తున్న ఓడ ఫ్రాన్సిస్ స్కాట్ కీ అనే బ్రిడ్జిని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలను మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ప్రమాదం సమయంలో వంతెనపై వెళ్లే అనేక వాహనాలు కూడా పటాప్‌స్కో నదిలో పడిపోయాయి. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి అడుగుభాగాన్ని కంటైనర్ షిప్ ఢీకొట్టినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఓడ ఢీకొట్టిన అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

నదిలోకి పడిపోయిన కార్లు.. 20మందికి పైగా గల్లంతు..
వంతెనపై నుంచి వాహనాలు నదిలోకి పడటం వంటి దృశ్యాలు అక్కడి సీసీ పుటేజీలో రికార్డు అయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం.. గత అర్థరాత్రి భారీ స్థాయి కంటైనర్ షిప్ ఈ వంతెనను ఢీకొట్టడంతో కూలిపోయినట్టు దృశ్యాల్లో కనిపించాయి. బాల్టిమోర్ అగ్నిమాపక విభాగానికి చెందిన కెవిన్ కార్ట్‌రైట్ మాట్లాడుతూ.. మొత్తం వంతెన ఒక్కసారిగా నదిలోకి కూలిపోయింది. వంతెనపై ఉన్న వాహనాలు కూడా పటాప్‌స్కో నదిలోకి పడిపోయాయి’ అని పేర్కొన్నారు. బ్రిడ్జి నదిలోకి కూలిపోయిన ఘటనలో 20 మంది వరకు నీటిలో గల్లంతైనట్టు తెలుస్తోంది. వాహనాలు నదిలో మునిగిపోగా అనేక మంది మృతి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


1.6-మైలు (2.6-కిలోమీటర్లు), నాలుగు లేన్ల వంతెన మునిసిపల్ బాల్టిమోర్‌కు నైరుతిగా పటాప్‌స్కో నదిపై విస్తరించి ఉంది. 1977లో ఈ వంతెనను నిర్మించారు. సంవత్సరానికి 11 మిలియన్లకు పైగా వాహనాలను ఈ నది మార్గంలోనే రవాణా ఎక్కువగా జరుగుతుంది. రాజధాని వాషింగ్టన్ డీసీ పక్కన యూఎస్ ఈస్ట్ కోస్ట్‌లోని పారిశ్రామిక నగరమైన బాల్టిమోర్ చుట్టూ ఉన్న రహదారి నెట్‌వర్క్‌లో ఇది ప్రధాన భాగంగా ఉంది.

ప్రస్తుతం వంతెన కూలిపోయిన చోట సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జిని ఢీకొట్టిన నౌక సింగపూర్‌కు చెందిన ‘డాలీ’గా గుర్తించినట్టు తెలుస్తోంది. వంతెన కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version