International

విశ్వాస పరీక్షలో నేపాల్‌ ప్రధాని ‘ప్రచండ’ ఓటమి- తదుపరి పీఎం ఎవరంటే?

Published

on

Nepal Pm Prachanda Loses Vote Of Confidence : నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. 275సీట్లు కలిగిన నేపాల్‌ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు 138ఓట్ల మెజార్టీ అవసరం. ప్రచండ ప్రభుత్వానికి మద్దతుగా 63మంది నిలవగా, వ్యతిరేకంగా 194ఓట్లు వచ్చాయి. మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలికి చెందిన పార్టీ మద్దతు ఉపసంహరణతో ప్రభుత్వం కూలింది. ఇప్పటికే 3సార్లు అవిశ్వాసం ఎదుర్కొన్న ప్రచండ, నేపాలీ కాంగ్రెస్‌తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. అందుకు ప్రచండ నిరాకరించడం వల్ల అవిశ్వాసం అనివార్యమైంది. నేపాలీ కాంగ్రెస్‌ 89సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, సీపీఎన్‌-యుఎంఎల్‌కు 78మంది సభ్యుల బలం ఉంది. వీరిద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రధానిగా ఓలి బాధ్యతలు చేపట్టేందుకు నేపాలీ కాంగ్రెస్‌ అంగీకరించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version