National
ఈవీఎంను లాక్కెళ్లి చెరువులో పడేసిన కార్యకర్తలు..
సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌ల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్రంలోని తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాలకు శనివారం ఏడవ దశ పోలింగ్ జరిగింది.
దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కుల్తాలీలో కొందరు ఇవాళ ఉదయం పోలింగ్ స్టేషన్‌లోకి దూసుకెళ్లి ఈవీఎంను లాక్కెళ్లి సమీపంలోని చెరువులోకి విసిరేశారు. కొంతమంది పోలింగ్ ఏజెంట్లు బూత్‌లలోకి ప్రవేశించకుండా చేశారంటూ ఈ ఘటనకు పాల్పడ్డారు. చెరువులో ఈవీఎం తేలుతూ కనపడింది.
West Bengal: EVM machine was seen floating in water during voting in South 24 Parganas. pic.twitter.com/HInj1D7gLe
— IANS (@ians_india) June 1, 2024
అలాగే, కోల్‌కతా సమీపంలోని జాదవ్‌పూర్ నియోజకవర్గం పరిధి భాంగర్‌లోని సతులియా ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, సీపీఎం మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది. దీంతో పలువురు గాయపడ్డారు. గత అర్థరాత్రి కూడా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. బసిర్‌హత్ లోక్‌సభ పరిధిలోని సందేశ్‌ఖాలీలో ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెదురు కర్రలు, ఆయుధాలతో నిరసన తెలిపారు.