International

Elon Musk : ఆ ‘వోక్‌మైండ్ వైరస్’ నా కొడుకును బలి తీసుకుంది.. నన్ను మభ్యపెట్టారన్న మస్క్.. తీవ్రంగా ఖండించిన కుమార్తె!

Published

on

Elon Musk : టెక్ బిలియనీర్, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన లింగమార్పిడి ప్రక్రియను తప్పుబట్టారు. లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారిన తన కుమారుడు ‘వోక్‌మైండ్ వైరస్’ కారణంగానే బలైపోయాడంటూ మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్లో లింగమార్పిడి ప్రక్రియను మస్క్ తప్పుబట్టారు. ఈ ప్రక్రియ తనకు ఇష్టం లేకపోయినా మభ్యపెట్టి మరి లింగమార్పిడి సర్జరీకి తనతో సైన్ చేయించారని మస్క్ చెప్పారు.

అప్పట్లో కరోనా సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోమైన పరిస్థితులు.. నా మనసు చాలా గందరగోళంగా అనిపించేది. లింగమార్పిడి చేయనిపక్షంలో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని చెప్పారని, అసలు వాస్తవాలను దాచిపెట్టి తనను మబ్యపెట్టారంటూ మస్క్ వాపోయారు.

ఒక మాటలో చెప్పాలంటే.. ‘‘ఇది స్టెరిలైజేషన్ లాంటిందిగా పేర్కొన్నారు. అత్యంత దుర్మార్గమైన చర్య.. ఇలాంటి ప్రక్రియను ప్రోత్సహిస్తున్న వారందరిని జైలుకు పంపాలి‘‘ అంటూ మస్క్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక్కడ.. వోక్‌మైండ్‌ వైరస్‌ అనే పదాన్ని ‘‘సామాజిక సమస్యలపై అతిగా స్పందించడం‘‘ ఉద్దేశించి మస్క్ మాట్లాడారు.

2008లో మస్క్ మాజీ భార్య జస్టిన్‌ విల్సన్‌తో విడాకులు తీసుకున్నారు. వీరికి జేవియర్‌ అలెగ్జాండర్‌, గ్రిఫ్పిన్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, వారిలో ఒకరైన జేవియర్‌ నాలుగేళ్ల కిందట లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాడు. తన తండ్రిలా ఆకారం, ఏ రూపంలోనూ ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లుగా వివియన్ జెనా విల్సన్‌గా పేర్కొన్నాడు. లింగమార్పిడి అనంతరం వివియన్ జెనా విల్సన్‌గా జేవియర్ పేరు మార్చుకున్నాడు.

నేనే అతన్ని తిరస్కరించాను.. మస్క్ వ్యాఖ్యలపై కుమార్తె విల్సన్ :
ఎలన్ మస్క్ కుమార్తె 20 ఏళ్ల వివియన్ జెన్నా విల్సన్.. తన లింగ పరివర్తనపై తండ్రి వాదనలను తీవ్రంగా ఖండించింది. “వోక్‌మైండ్ వైరస్”పై మస్క్ వ్యాఖ్యలను బహిరంగంగానే ఆమె తప్పుబట్టింది. థ్రెడ్స్ వేదికగా 13వేల మంది ఫాలోవర్లతో మాట్లాడుతూ.. తానే మస్క్‌ని తిరస్కరించానని, మరో విధంగా కాదని స్పష్టం చేసింది. మస్క్ చేసిన ట్వీట్‌ను తప్పుబడుతూ వరుస ట్వీట్లను చేసింది. ‘‘జేవియర్ స్వలింగ సంపర్కుడిగా జన్మించాడు. కొద్దిగా ఆటిస్టిక్‌ (ఆటిజం)గా ఉన్నాడు. మానసిక పరమైన ఎదుగుదల లేదు.

Advertisement

లింగ డిస్ఫోరియా లక్షణాలను కలిగి ఉన్నాడు. అతను దాదాపు 4 ఏళ్ల వయస్సు నుంచి నాకు తెలుసు. తనకు జాకెట్ ధరించాలని ఉందని చెప్పేవాడు. కానీ అతడు అమ్మాయి కాదు’’ అంటూ మస్క్ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన విల్సన్.. తండ్రి వ్యాఖ్యలను పూర్తిగా తప్పు అంటూ లేబుల్ చేసింది. మస్క్ సానుభూతి పొందేందుకు వాటిని కల్పించినట్లు తెలిపింది. తన పరివర్తనకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా సూచించారని ఆమె ఆరోపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version