National

ఎన్నికల వేళ శుభవార్త.. ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లో తగ్గుదల

Published

on

దేశంలో కమర్షియల్ సిలిండర్ల రేట్లు తగ్గాయి. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.19 మేర తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. గృహ అవసరాల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.

ప్రధాన నగరాల్లో ఇలా..

ఇవాళ 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో రూ.1764.50 నుంచి రూ.1745.50కి తగ్గింది
హైదరాబాద్‌లో రూ.32.50 తగ్గిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1994.50గా ఉంది
కోల్‌కతాలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1879.00 నుంచి రూ.1859.00కి దిగొచ్చింది
ముంబైలో రూ.1717.50 నుంచి రూ.1698.50కి తగ్గింది
చెన్నైలో రూ.1930.00 నుంచి రూ.1911కి తగ్గుదల కనపడింది
గృహ అవసరాల సిలిండర్ల ధరల్లో మార్పులు లేవు

14.2 కిలోల సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.855గా కొనసాగుతోంది
లక్‌నవూలో రూ.840.5గా ఉంది
జైపూర్‌లో రూ.806.50గా కొనసాగుతోంది
గురుగ్రామ్‌లో రూ.811.50గా ఉంది
ఢిల్లీలో రూ.803గా కొనసాగుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version