National

Election duty : పోలింగ్ విధుల్లోని ఉద్యోగులకు ఈసీ గుడ్ న్యూస్ 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్

Published

on

ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14వ తేది మంగళవారం ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలియ జేశారు.

ఈమేరకు సంబంధిత లీవ్ శాంక్సనింగ్ అథారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. 13న ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటీ)గా పరిగణించాలని ఏపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్టు సీఈఓ స్పష్టం చేశారు. పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు(ఏపీఓ) ఇతర పోలింగ్ సిబ్బంది (ఓపీఓ)కి 14న ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటీ) వర్తిస్తుందని తెలిపారు.

రిజర్వుడ్ సిబ్బందికి వర్తించదు

పోలింగ్ విధులకై రిజర్వుడు సిబ్బందిగా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందిగా డ్రాప్టు చేసిన వారికి ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ వర్తించదని సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. వాస్తవంగా ఎవరైతే పోలింగ్ విధులు నిర్వహిస్తారో వారికి మాత్రమే ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఈ ఆదేశాలను రిటర్నింగ్ అధికారులందరికీ తెలియజేసి 13న పోలింగ్ అనంతరం రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రిని అప్పగించిన తర్వాత పీఓ, ఏపీఓ, ఓపీఓలకు డ్యూటీ సర్టిఫికెట్లను జారీ చేసి 14న ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటీ) సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సీఈవో మీనా ఆదేశించారు.

అదే విధంగా అందరు కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు సంబంధిత లీవ్ శాంక్సనింగ్ అథారిటీలకు ఈ ఆదేశాలను సర్క్యులేట్ చేసి పోలింగ్ విధులు నిర్వహించిన వారికి 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ గా పరిగణించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలియజేశారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version