Teachers Info
DSC application | ఏపీలో డీఎస్సీ దరఖాస్తుల గడువు పెంపు
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియమకాల కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల (DSC application) దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడురోజుల పాటు పొడిగించింది.
ఈనెల 22 వరకు చివరి తేదీగా నిర్ణయించగా దానిని 25వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . ఈనెల 12న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా ఫిబ్రవరి 22 చివరి తేదీగా నిర్ణయించింది.
సెంకడరీ గ్రేడ్ టీచర్స్ ( ఎస్‌జీటీ), స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ), ట్రేయిన్డ్ గ్యాడ్యుయేట్ టీచర్(Secondary Grade Teachers ), పోస్టు గ్యాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అన్ని కేటగిరిలో కలిపి మొత్తం 6100 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మార్చి 5వ తేదీన హల్‌టికెట్ల జారీ, మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ, మార్చి 31న ఆన్సర్ కీ రిలీజ్, ఏప్రిల్ 2న ఫైనల్ కీ రిలీజ్(Final Key) , ఏప్రిల్ 7న చివరి ఫలితాలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.