Health

Drinking Water: బ్రష్ చేయకుండా నీరు తాగుతున్నారా?

Published

on

Drinking Water: దంతాలను క్లీన్ చేసుకోకుండా ఎలాంటి పదార్థాలు తినకూడదు అంటారు పెద్దలు, నిపుణులు. లేదంటే చాలా అనారోగ్యాలు తలెత్తుతాయట. బ్రెష్ చేసుకోకుండా ఏవైనా ఆహారపదార్థాలు తింటే నోట్లో ఉన్న క్రిములు కడుపులోకి చేరుతాయి. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఉదయం లేవగానే ఒక గ్లాసు వాటర్ తాగాలని చెబుతారు వైద్యులు. మరి బ్రెష్ చేయకుండా నీరు తాగడం మంచిదా కాదా అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తాగునీరు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఆరోగ్యకరమైన వ్యక్తికి ఒక రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు కావాలి. వేసవి కాలంలో అయితే దీన్ని కచ్చితంగా పాటించాలి. అందుకే ఉదయం లేవగానే దాహం వేస్తుంది. అయితే బ్రెష్ చేయకుండా నీరు తాగడం వల్ల ఎలాంటి హాని జరగదు అంటున్నారు నిపుణులు. అవును మీరు విన్నది నిజమే. అంతేకాదు పళ్లు తోమకుండా నీరు తాగితే చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయట. మరి అవేంటో కూడా తెలుసుకోండి.

బ్రష్ చేయకుండా నీరు తాగితే నోటిలో ఉండే బ్యాక్టీరియా లాలాజలం ద్వారా పొట్టలోకి వెళ్తుంది. కానీ దానిలో ఉండే అధిక ఆమ్ల కంటెంట్ వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. కాబట్టి బ్రెష్ చేయకుండా నీరు తాగవచ్చు. ఇక ఇలా బ్రష్ చేయకుండా నీరు తాగితే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. తద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్ ల బారిన పడరట. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన తొలిగిపోతుంది. జుట్టు బలంగా, నిగనిగలాడుతుంది అంటున్నారు నిపుణులు.

ఇలా నీరు తాగడం వల్ల ముఖం, చర్మానికి గ్లో వస్తుంది. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదట. స్థూలకాయం కూడా క్రమంగా తగ్గుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మలబద్దకం, అసిడిటీ వంటి పొట్ట సమస్యలు కూడా తొలిగిపోతాయి. కావిటీస్ ప్రమాదం కూడా ఉండదు. నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోదు. అంతేకాదు ఇలా బ్రష్ చేయకుండా నీరు తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. మరి తెలుసుకున్నారు కదా పాటించండి. కానీ ఇలాంటివి పాటించేముందు వైద్యులను సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version