International
పాస్ కావద్దు అంతే.. బిల్లుకు సంబంధించిన పత్రాలను పట్టుకుని పార్లమెంటు నుంచి ఎంపీ పరుగులు
తైవాన్ పార్లమెంట్‌లో విచిత్ర ఘటన జరిగింది. రాజ్యాంగంలో ఓ సంస్కరణ కోసం ప్రవేశపెట్టిన బిల్లు పాస్ కాకుండా చేయడానికి ఓ ఎంపీ ఆ బిల్లుకు సంబంధించిన పత్రాలను పట్టుకుని పార్లమెంటు నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వివాదాస్పద సంస్కరణ బిల్లుపై పార్లమెంటులో తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంటున్న వేళ ఎంపీ గువో గువెన్ బిల్లు పత్రాలను లాక్కొని పరుగులు తీసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయనను అడ్డుకునేందుకు తోటి ఎంపీలు ఎంతగా ప్రయత్నించా వారి ప్రయత్నాలు ఫలించలేదు.
🇹🇼 LMAO: A member of Taiwan's parliament stole a bill “with the speed of an American football player” to prevent it from being passed.
-> That should just be an official process in any democracy. Love it … haha pic.twitter.com/0C4T4DbbSU
— Lord Bebo (@MyLordBebo) May 17, 2024
జనవరిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, అధ్యక్షుడిగా ఎన్నికైన లై చింగ్-తే సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ లేనప్పటికీ లై చింగ్-తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కుమింటాంగ్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ దక్కలేదు.
దీంతో తైవాన్ పీపుల్స్ పార్టీతో కలిసి ఆందోళన తెలిపింది. పార్లమెంటులో అసత్యాలు చెప్పే అధికారులను శిక్షించడం, ప్రభుత్వ చర్యలను పరిశీలించే మరింత అధికారాన్ని పార్లమెంటుకు ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేసింది. ఈ సమయంలోనే వివాదాస్పద బిల్లు పత్రాలను ఎంపీ పట్టుకుని పరుగులు తీశారు.