International

సాహసం చేయరా డింభకా.. వణుకుపుట్టించే వీడియో.. ఎంపైర్ స్టేట్ యాంటీనాపైకి ఎక్కి నిలబడి సెల్ఫీ స్టంట్..!

Published

on

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా క్రేజ్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో వారి ప్రాణాలను కోల్పోవడం లేదా ఇతరుల ప్రాణాలను తీస్తున్న ఘటనలు ఎక్కడో ఒక చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలాంటి సాహసాలను ప్రయత్నించేవారిలో కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు.

సాహసం కృత్యాల్లో కొందరు వ్యక్తులు వ్యూస్ కోసం ఏదైనా చేయగలరు. కొందరు తమ కంఫర్ట్ లెవెల్‌తో ప్రయోగాలు చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం ప్రమాదం అని తెలిసి కూడా రిస్క్ చేస్తుంటారు. ఇటీవల, న్యూయార్క్ నగరంలో 1,435 అడుగుల ఎత్తులో ఉన్న ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సన్నని యాంటెన్నాపై నిలబడి ఓ యువకుడు స్టంట్ చేశాడు.

చూస్తూనే గుండె ఆగిపోయేలా ఉన్న ఆ వీడియో.. ఇంటర్నెట్‌లో నెటిజన్లకు దడ పుట్టిస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి సెల్ఫీ స్టిక్‌తో కెమెరాను పట్టుకుని, యాంటెన్నాపై ప్రమాదకరంగా నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత అతను కెమెరాను తన తలపైకి లేపి, చుట్టుపక్కల ప్రాంతాన్ని చూపించే ప్రయత్నం చేయడం వణుకుపుట్టిస్తోంది.


లైవ్‌జన్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్టు చేయగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. షేర్ చేసినప్పటి నుంచి వీడియో 27 లక్షలకు పైగా లైక్‌లు, 41 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. ఈ వీడియో వీక్షకులను విస్మయానికి గురిచేసింది. ఇంత సాహసోపేతమైన స్టంట్‌ను ఎలా చేయగలిగాడు అని నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు.

”ఇది చూసిన తర్వాత నా అరచేతులు, అరికాళ్ళు చెమటలు పట్టాయి’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, మరొకరు ”మిషన్ విజయవంతమైన గౌరవం” అని వ్యాఖ్యానించారు. ‘బ్రోకి నిజంగా భయం లేదు” అని మూడో యూజర్ కామెంట్ చేశాడు. ”ఈ డేంజరస్ స్టంట్ చూస్తే మీ కుటుంబం భయంతో వణికిపోతుంది’’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు.

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనేది న్యూయార్క్ నగరంలోని మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లో ఉన్న ఐకానిక్ 102-అంతస్తుల ఆకాశహర్మ్యం. 1931లో ఇది పూర్తయింది. 40 సంవత్సరాలకు పైగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా పేరొందింది. ఆకట్టుకునేలా 1,454 అడుగుల (443 మీటర్లు) ఎత్తులో ఉంటుంది. మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లో, 34వ వీధిలో ఐదవ అవెన్యూలో ఉంది.

ఈ భవనంలో 86వ, 102వ అంతస్తులలో రెండు అబ్జర్వేషన్ డెక్‌లు ఉన్నాయి. దీనిపై ఎక్కి నిలబడితే నగరం అద్భుతంగా కనిపిస్తుంది. స్టీల్ ఫ్రేమ్, కాంక్రీట్ కోర్ ఎంతటి బరువునైనా తట్టుకునేలా నిర్మించారు. ఆనాటి ఇంజనీరింగ్ ఎంతో అద్భుతమని చెప్పవచ్చు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సంవత్సరానికి 4 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. న్యూయార్క్ నగరంలో అత్యంత పాపులర్ టూరిస్టు స్పాట్లలో ఇదొకటిగా నిలిచింది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version