Business

Divaa Card: మహిళల కోసం యూనియన్ బ్యాంక్ ప్రత్యేక క్రెడిట్‌ కార్డ్.. వావ్‌ అనేలా బెనిఫిట్స్

Published

on

Credit Card: మహిళల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను తీసుకొచ్చాయి. అవసరమైన మేరకు పలు సంస్కరణలను ప్రవేశపెడుతూనే ఉన్నాయి.

అయితే వారి ఆర్థిక స్వాతంత్య్రం కోసం ప్రభుత్వం రంగంలోని యూనియన్ బ్యాంక్ ఓ స్కీమ్ డిజైన్ చేసింంది. ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన బెనిఫిట్స్‌తో ఓ క్రెడిట్ కార్డును రిలీజ్ చేసింది. దాని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

పిల్లల నుంచి మహిళలు, సీనియర్ సిటిజన్స్ వరకు నిర్ధిష్ట వర్గాల కస్టమర్ల కోసం బ్యాంకులు వంటి ఆర్థిక సంస్థలు కొన్ని ఉత్పత్తులను లాంచ్ చేస్తుంటాయి. ఇలా మహిళా వినియోగదారుల కోసం తీసుకొచ్చిన క్రెడిట్ కార్డ్ సర్వీస్ దివా. ఈ కార్డు ద్వారా వారికి పలు ప్రయోజనాలు లభిస్తాయని బ్యాంక్ చెబుతోంది.

దివా క్రెడిట్ కార్డ్ కేవలం 18 నుంచి 70 ఏళ్ల వయస్సు కలిగిన మహిళా కస్టమర్ల కోసం మాత్రమే ఉద్దేశించింది. కనీస సంవత్సర ఆదాయం 2.5 లక్షలుగా బ్యాంక్ నిర్ణయించింది. ఆదాయ రుజువు లేని పక్షంలో ఫిక్స్డ్‌ డిపాజిట్ భద్రతపై కూడా కార్డు జారీ చేస్తారు. దీని నుంచి యాడ్-ఆన్ కార్డులు కూడా కేవలం మహిళలకు మాత్రమే అందిస్తారని గమనించాలి.

ఈ కార్డు ద్వారా ఏడాదికి 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ మరియు 2 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. వార్షిక రక్త పరీక్షలతో కూడిన హెల్త్ ప్యాకేజీని అందిస్తుంది. రూపే నెట్‌వర్క్‌లో జారీ కావండతో వివిధ వ్యాపార ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్‌లు, UPI బెనిఫిట్స్ వర్తిస్తాయి. రూ. 100 గరిష్ఠ మొత్తంతో 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్‌ రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది. 24/7 ట్రావెల్, హోటల్ రిజర్వేషన్స్, కన్సల్టెన్సీ సేవల అసిస్టెన్స్ పొందవచ్చు.

Advertisement

లాక్మీ సెలూన్, నైకా, ఇక్సిగో, మింత్రా, ఫ్లిప్‌కార్డ్, బిగ్ బాస్కెట్, బుక్‌ మై షో, అర్బన్ క్లాప్ వంటి సైట్లలో స్పెషల్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. వీటితో పాటు ప్రతి రూ.100 ఖర్చుకు రూ.2కు సమానమైన రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వార్షిక రుసుము రూ.499 కాగా.. ఓ ఏడాదిలో 30 వేలు ఖర్చు చేస్తే అది కూడా మినహాయిస్తారు. దరఖాస్తు కోసం శాలరీ స్లిప్, ఫారం 16, ITR రిటర్నులతో పాటు పాన్, ఆధార్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version