Cricket

Dinesh Karthik : వరుస బౌండరీలతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను వణికించిన దినేశ్ కార్తీక్.. వీడియో వైరల్

Published

on

IPL 2024 : ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్ ఏదంటే.. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనక తప్పదు. సోమవారం రాత్రి ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బౌండరీల వర్షం కురిసింది. మ్యాచ్ జరిగినంత సేపు సిక్సులు, ఫోర్లతో స్టేడియం హోరెత్తింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు.. ఆది నుంచి వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తీక్ వీరవిహారం చేసి కొద్దిసేపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును వణికించాడు.


ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొత్తం 549 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ఇది. ఈ మ్యాచ్ లో ఇరుజట్ల బ్యాటర్లు మొత్తం 43 ఫోర్లు, 38 సిక్సులు కొట్టారు. అయితే, 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ దూకుడుగా ఆడారు. కోహ్లీ (42) భారీ షాట్ కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ కాగా.. డూప్లెసిస్ (62) కూడా కొద్దిసేపటికి పెవిలియన్ బాట పట్టాడు. వరుసగా ఆర్సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ బాట పట్టారు. హైదరాబాద్ గెలుపు ఖాయమని అందరూ అనుకుంటున్న సమయంలో దినేశ్ కార్తీక్ వరుస సిక్సర్లతో కొద్దిసేపు ఆర్సీబీ అభిమానుల్లో ఆశలు రేకెత్తించాడు. దినేశ్ కార్తీక్ కేవలం 34 బంతుల్లోనే ఏడు సిక్సులు, ఏడు ఫోర్లతో 83 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version