National

Delhi: సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‎కు నిరసనగా ఇండియా కూటమి మెగా ర్యాలీ.. ఎప్పుడంటే..

Published

on

కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి ఈనెల 31వ తేదీన ఢిల్లీలో మెగా ర్యాలీకి ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ తొలి ఆర్డర్‌ జారీ చేశారు. ఢిల్లీ ప్రజల నీటి కష్టాలను దూరం చేయాలని మంత్రి ఆతిషికి ఆయన లేఖ రాశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం చేయాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. ఈనెల 31వ తేదీన ఢిల్లీ రాంలీలా మైదానంలో మెగా ర్యాలీ నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఆప్‌ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాయి. అయితే కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు కూడా ఆందోళన చేశాయి.

ఆప్‌ నేతలపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు ఢిల్లీ మంత్రి గోపాల్‌రాయ్‌. ఈనెల 31వ తేదీన ఢిల్లీలో జరిగే ర్యాలీకి ఇండియా కూటమి నేతలతో పాటు ప్రజాస్వామ్యవాదులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆప్‌ కార్యాలయంలోకి కూడా వెళ్లకుండా తమను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.అరవింద్‌ కేజ్రీవాల్‌ రూటే వేరు. సామాన్యుడిగా పార్టీ నెలకొల్పినా, రెండు రాష్ట్రాల్లో అధికారం సాధించినా ఆయన టాక్‌ ఆఫ్‌ ది కంట్రీ అయ్యారు. ఇక సీఎం హోదాలో జైలుకు వెళ్లినా ఆయన స్పెషలే. ED కస్టడీ నుంచి పాలన ఎలా చేయాలో కేజ్రీవాల్‌ చూపిస్తున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ED కస్టడీ నుంచి తొలి ఆర్డర్‌ ఇచ్చారు కేజ్రీవాల్‌. జలవనరుల విభాగానికి సంబంధించిన వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారు కేజ్రీవాల్‌. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో సమస్యలు వస్తున్నాయి. సమస్యలు ఉన్నచోట, ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్‌ అధికారులను ఆదేశించారు. జైల్లో ఉన్నా కేజ్రీవాల్‌ ప్రజల కోసమే పనిచేస్తారన్నారు ఢిల్లీ మంత్రి ఆతిషి. ED కస్టడీలో ఉన్నా, ప్రజల కోసం ఆయన ఆలోచిస్తూ, లేఖ రాసినపుడు, తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు. తమ సీఎం జైల్లో ఉన్నప్పటికి ఏ పని ఆగదన్నారు. కేజ్రీవాల్‌ నుంచి నాకు ఈ లేఖ అందినప్పుడు కన్నీళ్లు వచ్చాయి. ఇంత కష్టసమయంలో తన గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉంటారా ? ఆయన జైలు నుంచి బయటకు ఎప్పుడు వస్తారో తెలియదు. ఢిల్లీ ప్రజల బాగోగుల గురించే ఆయన ఆలోచిస్తున్నారు. కేజ్రీవాల్‌ ఇప్పటికీ తమ CM అని ఆమ్‌ఆద్మీ చెబుతోంది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో కేజ్రీవాల్‌ని న్యాయస్థానం దోషిగా నిర్ధారణ చేయలేదంటోంది. ఈ క్రమంలో కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ ఫస్ట్‌ ఆర్డర్‌ చర్చనీయాంశం అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version