Business

DD Channel New Logo: ‘కాషాయం లోగో.. హిందీ అక్షరాలు..’ దూరదర్శన్‌ లోగో మార్పుపై నెటిజన్ల ఫైర్‌

Published

on

భారత ప్రభుత్వ బ్రాడ్‌ కాస్టర్‌ ఛానల్‌ దూరదర్శన్‌ లోగో మారింది. ఇప్పటి వరకూ ఎరుపు రంగులో ఉన్న డీడీ లోగో కాషాయ రంగు పులుముకుంది. రూపం మారిన విలువలు అలాగే ఉన్నాయంటూ డీడీ ప్రకటించింది. లోగోతోపాటు లోగో కింద ఉంటే న్యూస్‌ అనే టెక్స్ట్‌లో మార్పులు చేశారు. డీడీకి బదులుగా న్యూస్‌ అని హిందీ అక్షరాలు లోగో కింద చేర్చింది. అత్యాధునిక స్టూడియో సిస్టమ్, పునరుద్ధరించిన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పుడు మేము కొత్త అవతార్‌లో మీకు అందుబాటులో ఉన్నాం. కానీ మా విలువలు అలాగే ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త వార్తలను అందిస్తారం. వేగంపై కచ్చితత్వం, దావాల కంటే వాస్తవాలు, సెన్సేషనలిజం కంటే నిజాలు మీ ముందు ఉంచుతాం.. అంటూ ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో డీడీ బృందం పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో డీడీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


మరోవైపు సరిగ్గా సార్వత్రిక ఎన్నికల సమయంలో డీడీ తన లోగోతోపాటు రంగును మార్చుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ‘ఎంతో చరిత్ర ఉన్న డీడీ న్యూస్‌ లోగో కాషాయరంగులోకి మారిపోయింది. ‘ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి’ అని దూరదర్శన్‌ మాజీ సీఈవో టీఎంసీ ఎంపీ జవహర్‌ సర్కార్‌ విమర్శించారు. దూరదర్శన్‌ చర్యను కేరళ సీఎం పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించి వార్తలను ప్రసారం చేసే దూరదర్శన్‌ న్యూస్‌ ఛానల్‌ లోగో రంగును కాషాయ రంగులోకి మార్చేసి తన విధేయతను ప్రదర్శించుకుందని ర బీజేపీపై పెద్దయెత్తున నెటిజన్లతోపాటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాగా గతంలో డీడీ ఛానెల్ లోగో బ్లూ కలర్ లో ఉండేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version