National

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Published

on

వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ వణికించిన రీమల్ తీవ్ర తుపాను తీరం దాటింది. వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్స్ – బంగ్లాదేశ్ కేపుపార మధ్య మోంగ్లకు సమీపంలో తీరం దాటిన రీమల్ అర్ధరాత్రి తీరం దాడినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు తీవ్ర తుపాను దూసుకెళ్లింది. దింతో అల్లకల్లోలంగా మారింది పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలోని సముద్రం. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు.. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలుల తీవ్రత పెరిగింది.

ఉత్తర దిశగా కదులుతున్న తీవ్ర తుపాను.. ఆ తర్వాత ఈశాన్య దిశగా దిశ మారి బలహీన పడనుంది రీమల్. వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. 27వ తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచనలు జారి చేసింది ఐఎండీ. మరోవైపు పశ్చిమ దిశ నుంచి ఏపీ పై గాలులు విస్తున్నాయి. ఏపీలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. చురుగ్గా మరికొన్ని ప్రాంతాలకు బంగాళాఖాతంలో విస్తరించాయి నైరుతి రుతుపవనాలు. రుతువనాలు వచ్చే వరకు మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version