Career

CUET UG 2024: సీయూఈటీ యూజీ 2024 కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ పొడిగింపు; ఇప్పటికైనా అప్లై చేసుకోండి..

Published

on

CUET UG 2024 last date: సీయూఈటీ యూజీ 2024 రిజిస్ట్రేషన్ గడువును మార్చి 31, 2024 రాత్రి 9:50 గంటల వరకు పొడిగించారు. అభ్యర్థులు, ఇతర సంబంధితుల విజ్ఞప్తి మేరకు ఈ మార్పు చేసినట్లు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజానికి, సీయూఈటీ యూజీ 2024 (CUET UG 2024 last date) కి అప్లై చేసుకునే గడువు మార్చి 26తో ముగిసింది.

మార్చి 31 రాత్రి 09.50 గంటల వరకు..
‘‘విద్యార్థులు ఇతర భాగస్వాముల నుండి వచ్చిన అభ్యర్థనల వల్ల సీయూఈటీ-యూజీ – 2024 (CUET UG 2024) కు అప్లై చేసుకునే గడువును పొడిగించాం. సీయూఈటీ యూజీ 2024 అప్లికేషన్ ఫామ్ ను ఆన్ లైన్ లో సమర్పించడానికి గడువును 31 మార్చి 2024 (రాత్రి 09:50 గంటల వరకు) వరకు పొడిగించాం’’ అని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ఎక్స్ లో చేసిన పోస్ట్ ద్వారా తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు exams.nta.ac.in/CUET-UG లేదా cuetug.ntaonline.in ల ద్వారా ఆన్ లైన్ లో మార్చి 31 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

మేలో పరీక్షలు
సీయూఈటీ యూజీ 2024 (CUET UG 2024) పరీక్షలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డును 2024 మే రెండో వారంలో డౌన్లోడ్ చేసుకోవచ్చని, మే 15 నుంచి మే 31, 2024 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. 2024-25 విద్యాసంవత్సరానికి సీయూఈటీ (యూజీ)-2024 () ను హైబ్రిడ్ విధానంలో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) / పెన్ అండ్ పేపర్) నిర్వహిస్తారు.

ఇలా అప్లై చేయండి..

  • విద్యార్థులు ముందుగా ఎన్టీఏ సీయూఈటీ అధికారిక వెబ్సైట్ cuetug.ntaonline.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీయూఈటీ యూజీ (CUET UG 2024) 2024 రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
  • అవసరమైన వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి ఫీజు చెల్లించండి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి, అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.
  • అప్లికేషన్ ఫామ్ పేజీని డౌన్ లోడ్ చేసుకుని, సేవ్ చేసుకోండి.
  • భవిష్యత్ అవసరాల కోసం హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Trending

    Exit mobile version