Health

‘కోవిషీల్డ్‌ టీకాతో కొన్ని సమస్యలు- ప్లేట్‌లెట్ కౌంట్‌ పడిపోవటం కూడా’ – Side Effects Of Covishield Vaccine

Published

on

Covishield Side Effects : కొవిడ్‌ టీకా కోవిషీల్డ్‌తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉందని బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ది టెలిగ్రాఫ్‌ ఓ కథనం ప్రచురించింది. కోవిషీల్డ్ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్‌ పడిపోవటం వంటి పరిస్థితులకు దారితీయవచ్చని కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో పేర్కొనట్లు తెలిపింది.

ఆస్ట్రాజెనెకాపై బ్రిటన్‌లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కోవిషీల్డ్‌ కరోనా టీకా అనేక సందర్భాల్లో మరణాలతోపాటు తీవ్ర గాయాలకు కారణమైనట్లు ఆరోపిస్తూ బ్రిటన్‌ హైకోర్టులో 50మందికిపైగా బాధితులు 100 మిలియన్ పౌండ్ల నష్ట పరిహారం కోరుతూ కేసులు వేశారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆస్ట్రాజెనెకా, అరుదైన సందర్భాల్లో సెడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది.

అయితే కరోనా సమయంలో కోవిషీల్డ్‌ టీకాను బ్రిటన్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధి చేసింది. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేసింది. ఈ టీకాలనే దేశంలో విస్తృతంగా వినియోగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version