Andhrapradesh
సామాన్యులకు కూర’గాయాలు’ – vegetables prices in AP
Vegetables Prices Increased Tremendously in AP : మాట వినని టమాటా, ఘాటెక్కిన ఉల్లి. ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలతో రాష్ట్రంలోని సామాన్య ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. కూరగాయాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. పదిహేను రోజులకు ముందు కిలో 20, 30రూపాయలు ఉన్న కూరగాయలు ఒక్కసారిగా 80 నుంచి వంద రూపాయలకు పెరిగాయి. నిత్యావసర ధరల భారంతో సతమతమవుతున్న ప్రజలకు ఆకాశాన్ని తాకిన కూరగాయల ధరలతో విలవిలలాడిపోతున్నారు. సామాన్యులు కొనుగోలు భారం అధికమవుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాడుకునే కూరగాయలు ధరలు పెరిగితే తినడం కష్టం అవుతుందని వినియోగదారులు వాపోతున్నారు.
తగ్గేదే లేదంటూ పదిహేను రోజులుగా రాష్ట్రంలోని అన్ని కూరగాయల మార్కెట్లలో ధరలు పెరిగిపోయాయి. వినియోగదారులు ఏం కొనాలో? ఏం తినాలో అర్థం కావటం లేదంటున్నారు. ధరలు పెరగడంతో వినియోగదారులు కూడా మార్కెట్లకు రావడంలేదు. పదిహేను రోజులకు ముందు 20, 30రూపాయలు ఉన్న కూరగాయలు ప్రస్తుతం కేజీ 80 నుంచి 100రూపాయల మధ్య ధరలు ఉన్నాయి. దీంతో పేద, మధ్య తరగతి వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే పెరిగిన నిత్యవసర ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు నిత్యం వినియోగించే కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో విలవిలలాడుతున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు తీసుకురావటంతో రవాణా ఖర్చులు పెరిగాయంటూ వ్యాపారులు డిమాండ్ సృష్టించి ధరలు పెంచేశారని వినియోగదారులు చెబుతున్నారు. 5, 10 రూపాయలకే వచ్చే కొత్తిమేర, కరివేపాకు కట్టలు 40 రూపాయలకు విక్రయిస్తున్నారు. 150 రూపాయలు ఉండే కేజీ బీన్స్ రూ. 200 చేసేశారు. బీరకాయలు, కాకరకాయలు, వంకాయలు, టమాటా, చిక్కుడు, క్యారెట్, ఉల్లి ధరలు పెంచేశారు. పెరిగిన ధరలతో కూరగాయలు కొనుగోలు చేయటం కష్టతరమైందని విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు.
కోలార్ నుంచి బీన్స్, క్యారెట్, కొత్తిమీర వంటి కూరగాయలు వస్తుంటాయి. ఐదు, పదిరూపాయలకు ఇచ్చే కొత్తిమేర, కరివేకు కూడా కట్ట 40రూపాయలు ధరలు పెంచారు. బీన్స్ కేజి 150 రూపాయలు నుంచి రూ. 200లకు అమ్ముతున్నారు. నెల రోజుల కిందట వరకు కేజీ టమాటాలు 20రూపాయలు ఉండేవి, ఇప్పుడు ఒక్కసారిగా 80రూపాయలకు ధరలు పెరిగాయి. చిక్కుళ్లు, వంకాయలు, బీరకాయలు, కాకరకాయలు కేజీ 100 రూపాయలు వరకు ధరలు పెరిగాయి. క్యారెట్ కూడా 60 రూపాయలకు అమ్ముతున్నారు. మునగకాయలు కేజీ 120, అల్లం 180 రూపాయలు పెరిగాయి. దీంతో మార్కెట్లో కూరగాయల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయని నెల్లూరు జిల్లా ప్రజలు వాపోతున్నారు.
“పెరిగిన ధరలతో కూరగాయలు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఒక్క సారి రూ.200 ఖర్చు చేసి కూరగాయలు కొనడం కష్టంగా ఉంది. డబ్బులు లేక కొన్ని సార్లు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తొంది. ప్రభుత్వం,అధికారులు ఇప్పటికైన జోక్యం చేసుకొని కూరగాయల ధరలను నియంత్రణ చేయాలి. అలాగే తూకాల్లో ఉన్న మోసాలను కట్టడి చేయాలి.” – వినియోగదారులు