Andhrapradesh

కలెక్టర్​తో పాటు మరో ముగ్గురు ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు – మరికొందరిపైనా విచారణ – EC Suspend On Few Police Officers

Published

on

EC Suspend on Few Police Officers in AP : ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ కొందరు ఉన్నతాధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్సన్‌వేటు వేసింది. ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పల్నాడు జిల్లా కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది.

పోలింగ్‌ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని.. దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు భావించినట్లు ఈసీ తెలిపింది. సీఎస్‌, డీజీపీతో భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు సమావేశమై.. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్‌, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version