Health
Coconut VS Lemon water: కొబ్బరి నీళ్లు VS నిమ్మ నీళ్లు… ఈ రెండింట్లో వేసవిలో ఏది తాగితే మంచిది?
Coconut VS Lemon water: వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అధికంగా పానీయాలను తాగుతూ ఉండాలి. ముఖ్యంగా నిమ్మ నీరు, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు ఇలాంటివి తాగడం వల్ల శరీరంలో తేమ శాతం పెరుగుతుంది. డీహైడ్రేషన్ లక్షణాలు రాకుండా ఉంటాయి. ఎక్కువ మంది వేసవిలో కొబ్బరినీళ్లు లేదా నిమ్మకాయ నీరు తాగేందుకు ఇష్టపడతారు. ఈ రెండింటిలో ఏది? మన శరీరానికి ఎక్కువ మేలు చేస్తుందో తెలుసుకోండి.
కొబ్బరినీళ్లు
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్ అధికంగా శరీరానికి అందుతాయి. దీన్ని ‘నేచర్స్ స్పోర్ట్స్ డ్రింక్’ అని పిలుస్తారు. దీనిలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడతాయి. కండరాల పరితీరును, నరాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే కొబ్బరి నీళ్లలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు కూడా లభిస్తాయి. అందుకే వీటిని కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే శరీరానికి శక్తి వస్తుంది.
నిమ్మకాయ నీరు
నిమ్మకాయలో సిట్రస్ లక్షణాలు ఎక్కువ. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు వీటిలో ఎక్కువ ఉంటాయి. దీని తాగడం వల్ల చాలా తక్కువ క్యాలరీలు అందుతాయి. రోగనిరోధక వ్యవస్థకు, చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. జీర్ణ క్రియకు ఇవి సహాయపడతాయి. నిమ్మకాయ నీరు తాగడం వల్ల నిమ్మకాయ నీటిలో ఆల్కలైజింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. శరీరంలో PH స్థాయిలను సమతుల్యం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.
వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవాలి. లేకుంటే కొన్ని ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలంటే కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు అధికంగా తీసుకోవాలి. ఈ రెండూ కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందాల్సిన అవసరం ఉంది. ఇలా ఎలక్ట్రోలైట్స్‌ను వెంటనే పొందాలంటే కొబ్బరి నీటిని తీసుకోవడం చాలా మంచిది. ఇది చాలా త్వరగా పని చేస్తుంది. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డిహైడ్రేషన్ వంటి సమస్య రాకుండా వెంటనే అడ్డుకుంటుంది.
ఇక నిమ్మరసం విషయానికొస్తే నిమ్మరసంలో… కొబ్బరినీళ్ళతో పోలిస్తే ఎలక్ట్రోలైట్స్ తక్కువగా ఉంటాయి. అయితే అధిక విటమిన్ సి ఉండడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది. వేసవి నెలలో వేడి నుంచి తట్టుకునేలా చర్మానికి UV కిరణాల వల్ల ఎలాంటి నష్టం కలగకుండా కాపాడుతుంది.
రెండింటిలో ఏదో ఒకటి తాగడం కన్నా వేసవిలో ఈ రెండూ తాగడం చాలా ముఖ్యం. కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ నీళ్లు… రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. ఎక్కువసేపు ఎండలో తిరిగిన వారు ఇంటికి వచ్చిన వెంటనే కొబ్బరి నీళ్లు లేదా నిమ్మకాయ నీళ్లు తాగడం చాలా ముఖ్యం. కొబ్బరి నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఆ తర్వాత నిమ్మకాయ నీళ్లను కూడా తాగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.