Andhrapradesh

CM Jagan Bus Yatra : ఇచ్ఛాపురం టు ఇడుపులపాయ- ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర

Published

on

CM Jagan Bus Yatra : ‘సిద్ధం’ అంటూ భారీ బహిరంగ సభలు నిర్వహించిన సీఎం జగన్(CM Jagan).. ఇక నేరుగా ప్రచారంలోకి దిగనున్నారు. ఇటీవల రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఇక ప్రచారానికి సిద్ధమయ్యారు సీఎం జగన్. ‘మేమంతా సిద్ధం’ (Memantha Siddham)పేరుతో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర(CM Jagan Bus Yatra) చేయనున్నారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. దాదాపు 20 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కవర్‌ అయ్యేలా బస్సు యాత్ర కొనసాగనుందని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు సుమారు 20 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రంలో ప్రతీ రోజూ ఒక బహిరంగ సభ నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. తొలి విడతలో బస్సు యాత్ర, అనంతరం ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నట్లు వైసీపీ ప్రకటించింది.

ఏప్రిల్ నుంచి బహిరంగ సభలు
ప్రాంతాల వారీగా సిద్ధం(Siddham) పేరుతో భారీ సభలు నిర్వహించిన వైసీపీ…అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారానికి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించనుంది. సీఎం జగన్ బస్సు యాత్ర(CM Jagan Bus Yatra), ప్రచార సభల వివరాలను వైసీపీ రేపు విడుదల చేయనుంది. 20 రోజుల పాటు కొనసాగే బస్సు యాత్రలో దాదాపు 25 సభల్లో సీఎం జగన్ పాల్గొంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలో నుంచి ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొంటారని తెలుస్తోంది. వైసీపీ ఎన్నికల ప్రచార కార్యాచరణపై పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లతో సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్ భేటీ కానున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సీఎం జగన్‌ పర్యటనలపై పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. ఎన్నికల ప్రచార పర్యటన రూట్ మ్యాప్‌, సభల నిర్వహణపై చర్చించనున్నారు.

త్వరలో మేనిఫెస్టో
సిద్ధం చివరి సభలో మేనిఫెస్టో(Ysrcp Manifesto) విడుదల చేస్తామని వైసీపీ(Ysrcp) ప్రకటించినా… వాయిదా పడింది. అయితే మేనిఫెస్టో రూపకల్పన తుదిదశకు చేరుకుందని, త్వరలో ప్రకటిస్తామని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఏపీలో పోలింగ్ కు ఇంకా 55 రోజులు ఉండడంతో వీలైనంతగా ప్రచారం చేయాలని సీఎం జగన్..పార్టీ శ్రేణులు, నేతలను ఆదేశించారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో తన పర్యటన ఉండేలా కార్యక్రమాలు ప్లాన్ చేయాలని సూచించారు. గత ఏదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సంక్షేమ పథకాలతో పొందిన లబ్దిని ప్రజలకు వివరించాలని సీఎం జగన్ అంటున్నారు.

ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 18 నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. దీంతో రాజకీయ పార్టీలు ప్రచారానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రధాని మోదీతో ప్రజాగళం సభ నిర్వహించాయి. వైసీపీ కూడా ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచార రంగంలో దిగబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version