National

CLAT 2025 Exam Date: క్లాట్‌-2025 ప్రవేశ పరీక్ష తేదీ విడుదల.. జులై నుంచి ఆన్‌లైన్‌ రిజిష్ట్రేషన్లు షురూ!

Published

on

దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీల్లో ‘లా’ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్‌) 2025 పరీక్ష తేదీ వెల్లడైంది. ఈ మేరకు కన్సార్టియం ఆఫ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ (CNLUs) అధికారిక ప్రకటన విడుదల చేసింది. పరీక్ష తేదీకి సంబంధించిన ప్రకటనను తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. తాజా ప్రకటన మేరకు క్లాట్‌ 2025 పరీక్ష ఈ ఏడాది డిసెంబర్‌ 1 (ఆదివారం)వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఈ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని ఇండియన్‌ లా కోర్సులకు కలిపి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు పరీక్ష నిర్వహణ తేదీని ఎగ్జిక్యూటివ్ కమిటీ, కన్సార్టియం ఆఫ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ నిర్ణయించింది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 2024 మొదటి వారంలో ప్రారంభం అవుతుంది. ఇతర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

కాగా న్యాయ విద్యలో ప్రవేశాలకు ప్రతీయేట కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆలిండియా స్థాయిలో నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీలలో అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందులో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంలలో ప్రవేశాలు పొందవచ్చు. యూజీ కోర్సులకు 10+2, పీజీ కోర్సులకు ఎల్‌ఎల్‌బీ డిగ్రీలో ఉత్తీర్ణులైన ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version