Business

Cibil score : జీవితంలో ఎప్పుడూ లోన్​ తీసుకోకపోయినా.. సిబిల్​ స్కోర్​పై ఎఫెక్ట్​ పడుతుందా?

Published

on

How to improve Cibil score : లోన్​ తీసుకోవాలంటే సిబిల్​ స్కోర్​ చాలా ముఖ్యం. మంచి క్రెడిట్​/ సిబిల్​ స్కోర్​ ఉంటే.. తక్కువ వడ్డీకి లోన్​ పొందొచ్చు. మన మీద ఆర్థిక భారం తగ్గుతుంది. కానీ సిబిల్​ స్కోర్​ సరిగ్గా లేకపోతే.. లోన్​ దొరకడం కూడా కష్టమవుతుంది. అంతా బాగుంది కానీ.. అసలు ఇప్పటివరకు ఒక్క లోన్​ కూడా తీసుకోకపోతే.. సిబిల్​ స్కోర్​ ప్రభావితం అవుతుందా? అని అడిగితే.. కచ్చితంగా ఎఫెక్ట్​ పడుతుందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆ వివరాలను ఇక్కడ చూద్దాము..

లోన్​ తీసుకోకపోయినా.. సిబిల్​ స్కోర్​పై ఎఫెక్ట్​!
సిబిల్​ స్కోర్​ అనేది ఒక 3 డిజిట్​ నెంబర్​. మన క్రెడిట్​ హిస్టరీని సూచించే నెంబర్​ ఇది. సాధారణంగా.. 300-900 మధ్యలో ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటే.. మనం అంత బాగా లోన్​ని తీర్చుతున్నట్టు! ఈ విషయం అర్థం చేసుకుని.. బ్యాంక్​లు, ఆర్థిక సంస్థలు మనకి ఇంకా ఇంకా లోన్​లు ఇస్తుంటాయి.

కానీ.. మీరు జీవితంలో ఎప్పుడూ లోన్​ తీసుకోకపోతే.. మీకు క్రెడిట్​ హిస్టరీ అనేదే ఉండదు. క్రెడిట్​ హిస్టరీయే లేకపోతే.. లోన్​ ఇచ్చే సంస్థలు కాస్త ఆలోచనలో పడతాయి. మీకు లోన్​ ఇవ్వాలా? వద్దా? అని ఆలోచిస్తాయి. ఆ సమయంలో వడ్డీ ఎక్కువగా ఉంటుంది. జీరో సిబిల్​ స్కోర్​ అనేది ఎప్పటికీ మంచిది కాదు.

How to check Cibil score for free : అలా అని.. జీరో సిబిల్​ స్కోర్​ ఉంటే మీకు లోన్​ రాదు అని కూడా కాదు! ఇతర అంశాలను పరిగణించి మీకు లోన్​ని మంజూరు చేస్తాయి ఆర్థిక సంస్థలు. కానీ అది మీరు కట్టే వడ్డీపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

క్రెడిట్​ స్కోర్​ని.. లోన్​ ఇచ్చే సంస్థలు మాటిమాటికి చెక్​ చేస్తే.. ఆ స్కోర్​ దెబ్బతింటుంది. ఇది మనకి మంచిది కాదు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సిబిల్​​ స్కోర్​ అనేది లోన్​పైనే ఆధారపడి ఉంటుందనుకోవడం కరెక్ట్​ కాదు. మీరు వాడే క్రెడిట్​ కార్డుపైనా ఆధారపడి ఉంటుంది. మీరు సకాలంలో క్రెడిట్​ కార్డు బిల్లులు చెల్లించకపోతే.. అప్పుడూ సిబిల్​ స్కోర్​ దెబ్బతింటుంది.

Advertisement

How to improve credit score : అసలు ఇన్ని రోజులు సిబిల్​ స్కోర్​ చెక్​ చేసుకోకపోయినా పెద్ద రిస్కే! స్కామ్​స్టర్​లు మోసాలకు పాల్పడి.. మీ పేరుతో లోన్​లు తీసుకుని, డబ్బులు కట్టకుండా కూడా ఉండొచ్చు! ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అందుకే.. మీ క్రెడిట్​ స్కోర్​ని రివ్యూ ఓసారి చేసుకోండి.

మరి సిబిల్​ స్కోర్​ని ఎలా పెంచుకోవాలి?
సిబిల్​ స్కోర్​ని పెంచుకోవాలంటే పెద్ద పెద్ద లోన్​లే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మొబైల్​ని లేదా వాషింగ్​ మిషిన్​, రిఫ్రిజరేటర్​ వంటి వాటిని లోన్​లో తీసుకోండి. నెలవారీ ఈఎంఐల ద్వారా డబ్బులు చెలలించండి. ఇలా అయితే.. మీదు అప్పు భారం ఉండదు. పైగా.. క్రెడిట్​ స్కోర్​ కూడా హెల్తీగా ఉంటుంది.

Cibil score range : సాధారణంగా.. 750 కన్నా ఎక్కువ సిబిల్​ స్కోర్​ ఉంటే చాలా మంచిదని అంటారు. 550- 750 మధ్యలో ఉంటే.. మంచిది అని పరిగణిస్తారు. 550 కన్నా తక్కువ ఉంటే మాత్రం.. సిబిల్​ స్కోర్​ చాలా తక్కువ ఉన్నట్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version