Cinema

Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్‌ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?

Published

on

మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం లభించిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దుబాయ్‌ గోల్డెన్‌ను వీసాను చిరు అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించే ప్రముఖులకు దుబాయ్‌ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. ఈ క్రమంలోనే చిరంజీవికి ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే చిరు కంటే ముందు మన దేశం నుంచి పలువురు ప్రముఖులకు ఈ గోల్డెన్‌ వీసా లభించింది. రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసనతో పాటు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రజనీకాంత్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌తో పాటు పలువురు ప్రముఖలకు దుబాయ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఈ గోల్డెన్‌ వీసాను అందించింది. ఇంతకీ ఈ గోల్డెన్‌ వీసా అంటే ఏంటి.? అసలు ఈ వీసా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* షాపింగ్‌ మొదలు పర్యాటకానికి కేరాఫ్‌గా మారిన దుబాయ్‌ని ప్రపంచ దేశాలకు చెందిన ధనవంతులు క్యూ కడుతుంటారు. అక్కడ నివాసం, వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసమే దుబాయ్‌ ప్రభుత్వం ఓ అవకాశాన్ని తీసుకొచ్చింది. దుబాయ్‌లో సొంత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి యూఏఈ తీసుకొచ్చిన విధానమే ఈ గోల్డెన్‌ వీసా. 2019 నుంచి దుబాయ్‌ ఈ విధానాన్ని అమలు చేస్తోంది.

* ఈ వీసా ద్వారా ఇతర దేశాలకు చెందిన వారు దుబాయ్‌లో దీర్ఘకాలికంగా నివసించే అవకాశం లభిస్తుంది. 10 ఏళ్ల కాల పరిమితతో ఉండే ఈ వీసా ఆ తర్వాత ఆటోమేటిక్‌గా రెన్యువల్ అవుతుంది. ఈ వీసాతో కేవలం నివాసమే కాకుండా సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహించుకోవచ్చు.

* ఒకవేళ గోల్డెన్‌ వీసా ప్రాథమిక హోల్డర్ మరణిస్తే ప్రాయోజిత కుటుంబసభ్యుల అనుమతి చెల్లుబాటుకు హామీ ఇస్తుంది.

Advertisement

* ఇక తమ సొంత దేశంలో డ్రైవింగ్ లైసెన్స్‌ కలిగి ఉన్న గోల్డెన్‌ వీసాదారులు. యూఏఈలో నేరుగా డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇందుకోసం దుబాయ్‌లోని డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో దరఖాస్తు చేసుకుని, రెండు పరీక్షలలో ఉత్తీర్ణులైతే చాలు లైసెన్స్ మంజూరువుతుంది.

* సాధారణంగా దుబాయ్‌లో వీసా పొందాలంటే స్పాన్సర్‌ లేదా యజమాని అవసరం ఉంటుంది. అయితే గోల్డెన్‌ వీసా ఉంటే అలాంటి అవసరం ఉండదు.

* ఇక గోల్డెన్‌ వీసా ఉన్న వారు ఆరు నెలల కంటే ఎక్కువగా కాలం దుబాయ్‌ బయట నివాసం ఉన్నా వీసా రద్దు కాదు.

* గోల్డెన్ వీసా ఉన్న వారు వారి కుటుంబ సభ్యులను సైతం స్పాన్సర్ చేసుకోవచ్చు. వీరు స్పాన్సర్‌ చేసే గృహ కార్మికులపై ఎలాంటి పరిమితి ఉండదు.

* గోల్డెన్‌ వీసా ఉన్న వారికి దుబాయ్‌లో అమల్లో ఉన్న ప్రత్యేక బీమా పాలసీలు అమలువతాయి.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version