Spiritual

Chilkur Balaji Temple : చిలుకూరు బాలాజీ ఆలయానికి పోట్టెత్తిన జనం.. ‘గరుడ ప్రసాదం’ రహస్యమిదే..!

Published

on

Chilkur Balaji Temple : చిలుకూరు బాలాజీ ఆలయానికి(Chilkur Balaji Temple) భక్తులు భారీగా పొటెత్తారు. శుక్రవారం ఉదయం నుంచే పెద్దఎత్తున తరలిరావటంతో…అటువైపు వెళ్లే రూట్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఫలితంగా భారీగా ట్రాపిక్ జామ్ అయింది. ఓ దశలో 10 నుంచి 15 కి. మీ వ్యవధిలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మెహిదీపట్నం, లంగారాహౌస్, అప్పా జంక్షన్ తో పాటు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉంది.

బ్రహ్మోత్సవాలు….
ప్రతిసారి కూడా శ్రీరామనవమి(Srirama Navami) అనంతరం రెండో రోజు.. చిలుకూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది కూడా బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ రెండో రోజు కాగా…. గరుత్మంతునికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ ప్రసాదాన్ని(Chilukur Balaji Garuda Prasadam Distribution) సంతానం లేని మహిళలకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఈ ప్రసాదానికి సంబంధించి ఆలయన పూజారులు కూడా ఇటీవలే ప్రకటన చేశారు. ప్రతి ఏడాది కూడా ఈ ప్రసాదం కోసం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ఈ ప్రసాదం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులుబాలాజీ ఆలయానికి పోటెత్తారు. పోలీసులు ముందుస్తుగానే ఏర్పాట్లు చేసినప్పటికీ ఊహించదానికంటే భక్తులు ఎక్కువగా రావటంతో… తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఏప్రిల్ 25వ తేదీన ధ్వజారోహణంతో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ప్రతి ఏడాది శ్రీరామనవమి అనంతరం రెండో రోజు.. చిలుకూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. ధ్వజారోహణకు కావలసిన ఏర్పాట్లన్నీ ముందుగానే పూర్తి చేస్తారు. ధ్వజంపై గరుడ పటాన్ని ఎక్కించిన తరువాత, ధ్వజస్తంభం క్రింద ఉన్న గరుత్మంతుని విగ్రహానికి అభిషేకం చేస్తారు. గరుత్మంతుని ఆరాధన అలంకారం తర్వాత… ధ్వజారోహణం సమయంలో నాలుగు దిక్కుల ఉన్న గరుక్మంతులవారికి పొంగలి నైవేధ్యం ఇస్తారు. దీన్ని గరుడపిండం లేక గరుత్మంతుని నైవేధ్యం అని పిలుస్తారని పూజారులు చెబుతారు.

ప్రసాదం అత్యంత శక్తివంతమైనది అని భక్తులు భావిస్తున్నారు. దీన్ని తీసుకున్న వారంతా దాదాపు గర్భవతులయ్యారని నమ్మకం. అలా ఆ నోటా ఈ నోటా విని ఇప్పుడు కొన్ని వేల మంది ప్రత్యేక ప్రసాదం స్వీకరించిన వారికి సంతాన భాగ్యం కలిగిందని అంటారు. 2019 సంవత్సరం కొన్ని వేలమంది భక్తులు ఈ ప్రసాదాన్ని తీసుకున్నారు. వారిలో చాలామంది ఇప్పుడు ఆలయానికి పిల్లల నెత్తుకొని వచ్చి గరుడ ప్రసాద ఫలితమని చెప్తున్నారు. 2020, 2021 సంవత్సరాలలో కరోనా కారణంగా ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించారు. ఆ తర్వాత ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తుండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version